AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో మెరుస్తాయ్.. సింపుల్ ట్రిక్స్ ఇవే..

కొత్తగా కొన్నప్పుడు ధగధగా మెరిసే వెండి పట్టీలు, కాళ్లకు పెట్టుకున్న కొద్ది రోజులకే నల్లబడిపోవడం ప్రతి ఇంట్లో మహిళలకు ఎదురయ్యే సాధారణ సమస్య. అయితే అలా నల్లబడిన ప్రతిసారీ షాపుకు వెళ్లి పాలిష్ చేయించాలంటే జేబుకు చిల్లే. పైగా మాటిమాటికీ కెమికల్ పాలిష్ చేయిస్తే వెండి బరువు కూడా తగ్గే ప్రమాదం ఉంది. మరి రూపాయి ఖర్చు లేకుండా వంటింట్లోని పదార్థాలతోనే నల్లటి పట్టీలను కొత్త వాటిలా ఎలా మెరిపించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో మెరుస్తాయ్.. సింపుల్ ట్రిక్స్ ఇవే..
How To Clean Silver Jewellery At Home
Krishna S
|

Updated on: Oct 18, 2026 | 6:49 PM

Share

వెండి పట్టీలు, కాలి మెట్టెలు, ఇతర ఆభరణాలను రోజూ ధరించడం వల్ల గాలిలోని తేమ, చెమట ప్రభావంతో అవి త్వరగానే నల్లబడిపోతుంటాయి. అలా నల్లబడిన ప్రతిసారీ పాలిష్ చేయించడానికి నగల దుకాణాల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు చేస్తుంటారు చాలామంది. అయితే రూపాయి ఖర్చు లేకుండా, ఇంట్లో ఉండే సాధారణ వంటింటి వస్తువులతోనే వెండి ఆభరణాల పాత మెరుపును తిరిగి తీసుకురావచ్చు. నిమిషాల వ్యవధిలోనే నల్లదనం పోయి సరికొత్తగా మెరిసేలా చేసే ఆ సులభమైన చిట్కాలు ఏంటో చూద్దాం.

అల్యూమినియం ఫాయిల్, బేకింగ్ సోడా మ్యాజిక్

ఒక గిన్నెలో అల్యూమినియం ఫాయిల్‌ను అడుగుభాగం కవర్ అయ్యేలా పరచండి. అందులో బాగా మరిగిన వేడినీళ్లు పోసి, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలపాలి. ఇప్పుడు నల్లబడిన వెండి పట్టీలను ఆ నీటిలో వేయండి. వేడినీరు, బేకింగ్ సోడా మరియు అల్యూమినియం ఫాయిల్ మధ్య జరిగే రసాయన చర్య వల్ల వెండిపై పేరుకుపోయిన నలుపు క్షణాల్లో తొలగిపోయి, పట్టీలు సరికొత్త వాటిలా ధగధగా మెరుస్తాయి.

టూత్‌పేస్ట్‌తో తక్షణ పాలిష్

ఇంట్లో రోజూ వాడే సాధారణ తెల్లటి టూత్‌పేస్ట్ వెండిని మెరిపించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఒక పాత, మృదువైన టూత్‌బ్రష్‌కు కొద్దిగా పేస్ట్ తీసుకుని పట్టీలు, గొలుసులపై సున్నితంగా రుద్దండి. సందుల్లో పేరుకున్న మురికి వదిలేలా నెమ్మదిగా బ్రష్ చేసి, ఒక 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి మెత్తటి పొడి గుడ్డతో తుడుచుకుంటే చాలు.

వెనిగర్ – బేకింగ్ సోడా కాంబినేషన్

ఎంతో కాలంగా వాడకుండా పక్కన పెట్టి విపరీతంగా నల్లబడిన వెండి వస్తువులకు వెనిగర్ బెస్ట్ రెమెడీ. అర కప్పు వెనిగర్‌లో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా కలపండి. ఆ ద్రావణంలో నల్లబడిన వెండి ఆభరణాలను వేసి 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టాలి. అనంతరం వాటిని బయటకు తీసి చల్లటి నీటితో కడిగి తుడిస్తే మొండి నల్లటి మరకలు పూర్తిగా మాయమవుతాయి.

నిమ్మరసం, ఉప్పుతో సహజ కాంతి

ఒక గిన్నెడు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, ఒక చెంచా ఉప్పు కలపండి. ఈ మిశ్రమంలో వెండి పట్టీలను కేవలం 5 నిమిషాల పాటు నానబెట్టండి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ నలుపును త్వరగా కరిగిస్తుంది. 5 నిమిషాల తర్వాత పట్టీలను బయటకు తీసి మెత్తటి కాటన్ గుడ్డతో తుడిస్తే సహజమైన మెరుపు మీ సొంతమవుతుంది.

లిక్విడ్ సోప్, శానిటైజర్‌తో త్వరిత క్లీనింగ్

కేవలం చిన్నపాటి మురికి, జిడ్డును వదిలించుకోవడానికి గోరువెచ్చని నీటిలో కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ కలిపి, పట్టీల సందుల్లో మృదువైన బ్రష్‌తో రుద్ది కడిగితే సరిపోతుంది. అలాగే ఎక్కడికైనా అర్జెంట్‌గా వెళ్లాల్సి వచ్చినప్పుడు శానిటైజర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఒక దూది లేదా టిష్యూ పేపర్‌పై కొన్ని చుక్కల శానిటైజర్ వేసి పట్టీలపై సున్నితంగా రుద్దితే పైపైనున్న స్వల్ప నల్లదనం క్షణాల్లో మాయమై తక్షణ మెరుపు వస్తుంది.

Follow Us
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
పుల్లగా.. కారంగా కోడిగుడ్డు పచ్చడి.. వేడి అన్నంలో అదిరిపోద్ది
పుల్లగా.. కారంగా కోడిగుడ్డు పచ్చడి.. వేడి అన్నంలో అదిరిపోద్ది
గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ
గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ
భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో..
భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో..
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..
3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్
3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్
గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..
గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..
ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్ హీరోయిన్
ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్ హీరోయిన్
పక్కా కొలతలతో ములక్కాడతో ఇలా పచ్చడి పెట్టారంటే
పక్కా కొలతలతో ములక్కాడతో ఇలా పచ్చడి పెట్టారంటే