AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన మూవీ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట ‘అమ్మ కనకదుర్గ’ను విజయవాడలో విడుదల చేశారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు తమన్ స్వరపరిచిన ఈ పాటను జీ మ్యూజిక్ కంపెనీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన మూవీ టీమ్
Allari Naresh
Rajeev Rayala
|

Updated on: Oct 18, 2026 | 6:00 PM

Share

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట ‘అమ్మ కనకదుర్గ’ను విజయవాడలో విడుదల చేశారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు తమన్ స్వరపరిచిన ఈ పాటను జీ మ్యూజిక్ కంపెనీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తమన్ ఎస్ సంగీతం అందించిన ఈ పాటకు సిరాశ్రీ సాహిత్యం అందించారు. కనకదుర్గమ్మ దివ్య అనుగ్రహం, శక్తి, ఆధ్యాత్మిక విశిష్టతను చాటిచెప్పేలా ఈ పాటను రూపొందించారు. భక్తి ప్రధానంగా తెరకెక్కుతోన్న‌ ఈ చిత్రంలోని అంతర్లీన భావాన్ని ఈ పాట‌ ఆవిష్కరిస్తోంది.

విజయవాడలో ఈ పాటను విడుదల చేయడం వెనుక ప్రత్యేకమైన కార‌ణం ఉంది. శ్రీ కనకదుర్గమ్మవారి ప్రసిద్ధ ఆలయం ఉన్న ఈ నగరానికి అమ్మవారితో విడదీయలేని ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. ముఖ్యంగా నవరాత్రులు, భవానీ దీక్షల సమయంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అలాంటి పవిత్ర నగరంలో ఈ పాటను విడుదల చేయడం ద్వారా, అమ్మవారిపై ప్రజలకు ఉన్న భక్తి విశ్వాసాలను ఈ పాట‌తో ముడిపెట్టారు. సినిమా సంగీత ప్రయాణానికి శ్రీకారం చుడుతున్న ఈ పాట, అమ్మవారి పట్ల భక్తులకున్న ఆరాధనా భావానికి ప్రతిబింబంగా నిలుస్తోంది.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ తమన్‌కు ఈ పాట ఎంతో ప్రత్యేకమైనది. కనకదుర్గమ్మవారికి పరమ భక్తుడైన తమన్, అమ్మవారి దర్శనం కోసం తరచూ విజయవాడకు వెళ్తుంటారు. ఆ భక్తి భావమే ఈ పాటలోనూ ప్రతిబింబించింది. మధురమైన స్వరాలు, అర్థవంతమైన సాహిత్యంతో రూపొందిన ‘అమ్మ కనకదుర్గ’ గీతం.. భక్తుడు అమ్మవారిని ప్రార్థించే భావోద్వేగాన్ని ఆవిష్కరిస్తోంది. సినిమా పరిధిని దాటి, అమ్మవారిపై భక్తులకు ఉన్న ఆరాధనా భావాన్ని సంగీత రూపంలో ఈ పాట చాటిచెబుతోంది. ఈ చిత్రంలో అల్లరి నరేశ్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తుండగా, బీవీఎస్ రవి కథను అందించారు. అమ్మవారి ఆధ్యాత్మిక విశిష్టత నేపథ్యంలో భక్తి, యాక్షన్, భావోద్వేగాల కలయికగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన తొలి పాట.. అమ్మవారిపై భక్తి విశ్వాసాలను ప్రతిబింబిస్తూ సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. భవానీ దీక్ష సంప్రదాయంతో ఈ సినిమాకు ఉన్న అనుబంధం.. అల్లరి నరేశ్ తన పాత్ర కోసం సిద్ధమైన తీరులోనూ కనిపించింది. షూటింగ్ సమయంలో ఆయన దీక్ష నియమాలను పాటిస్తూ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించారు. ఇందులో భాగంగా మాంసాహారాన్ని తీసుకోలేదు. చెప్పుల‌ను ధ‌రించ‌లేదు. విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చిత్ర బృందం సమక్షంలో ఈ పాటను విడుదల చేశారు. ‘అమ్మ కనకదుర్గ’ పాటతో సినిమా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టిన చిత్ర బృందం.. భక్తి, సంగీతానికి ప్రాధాన్యమిస్తూ ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ సంద‌ర్భంగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..
3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్
3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్
గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..
గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..
ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్ హీరోయిన్
ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్ హీరోయిన్
పక్కా కొలతలతో ములక్కాడతో ఇలా పచ్చడి పెట్టారంటే
పక్కా కొలతలతో ములక్కాడతో ఇలా పచ్చడి పెట్టారంటే
ఈ రూట్లో వందే భారత్ స్లీపర్ రైలు ఫిక్స్.. షెడ్యూల్ ఇదిగో..!
ఈ రూట్లో వందే భారత్ స్లీపర్ రైలు ఫిక్స్.. షెడ్యూల్ ఇదిగో..!
వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఈ ముగ్గురు ఔట్.. మరోసారి నో ఛాన్స్..?
వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఈ ముగ్గురు ఔట్.. మరోసారి నో ఛాన్స్..?
నీళ్లను తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న..
నీళ్లను తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న..
హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
వాటర్ వేస్ట్ చేస్తే.. మీకు కూడా ఇదే పరిస్థితి.. జలమండలి సీరియస్
వాటర్ వేస్ట్ చేస్తే.. మీకు కూడా ఇదే పరిస్థితి.. జలమండలి సీరియస్