AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: పసిడి ధరలపై పెద్ద ఊరట.. గోల్డ్ రూ.3 వేలు, వెండి రూ.5 వేలు ఢమాల్.. కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్..

పండక్కి బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఇదే మంచి ఛాన్స్, రాబోయే రోజుల్లో వరుస పండుగల కారణంగా ధరలు పుంజుకనే అవకాశముంది. పండుగుల కారణంగా బంగారం కొనాలనే సెంటిమెంట్ ప్రజల్లో ఉంటుంది. దీని వల్ల డిమాండ్ పెరిగితే ధరలు మళ్లీ పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Venkatrao Lella
|

Updated on: Oct 18, 2026 | 5:56 PM

Share
బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయమా..? పండుగ సీజన్ క్రమంలో రాబోయే రోజుల్లో డిమాండ్ వల్ల ధరలు పెరగనున్నాయా? అంటే అవుననే అంటున్నారు మార్కెట్ నిపుణులు. వారం రోజుల్లో బంగారం ధరలు భారీగా డౌన్ అయ్యాయి. గత వారంలో ధరలు కుప్పకూలాయి. అయితే దసరా, దీపావళి వరుస పండుగల క్రమంలో డిమాండ్ వల్ల రాబోయే రోజుల్లో ధరలు పెరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి టైమ్ అని విశ్లేషిస్తున్నారు.

1 / 5
గత వారం రోజుల్లో బంగారం ధరలు ఢమాల్ అయ్యాయి. అక్టోబర్ 9  నుంచి 16వ తేదీ వరకు ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో అక్టోబర్ 9న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,710 వద్ద ప్రారంభమవ్వగా.. 16వ తేదీ నాటికి రూ.1,47,440కి చేరుకుంది. అంటే రూ.3270 మేర పడిపోయింది.

2 / 5
ఇక 22 క్యారెట్ల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో అక్టోబర్ 9న రూ.1,38,150 వద్ద ప్రారంభమవ్వగా.. 16వ తేదీ నాటికి రూ.1,35,150కి దిగొచ్చింది. అంటే వారం మొత్తంలో ధరల రూ.3 వేలు తగ్గింది. అటు వెండి ధరలు కూడా గత వారంలో కుప్పకూలాయి.

3 / 5
అక్టోబర్ 9న హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.45 లక్షల వద్ద ఉండగా.. అక్టోబర్ 16 నాటికి రూ.2.40 లక్షలకు పడిపోయాయి. అంటే వారంలో రూ.5 వేలు తగ్గింది. ధరలు తగ్గడం పండుగల సమయాల్లో పసిడి కొనేవారికి ఉపశమనంగా చెప్పవచ్చు.

4 / 5
అక్టోబర్ 18న హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,47,660 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,350కు లభిస్తోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.2.40 లక్షల వద్ద ట్రేడవుతోంది.

5 / 5
Follow Us