AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ, పోటెత్తిన భక్తులు

ఉత్తరాంధ్ర ఇలవేల్పు విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు, ఎనిమిదో రోజైన ఆదివారం గజలక్ష్మిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. లక్ష గాజులతో అమ్మవారి గర్భగుడిని అలంకరించారు భక్తులు. అనంతరం లక్ష గాజుల పూజను వైభవంగా నిర్వహించారు.

Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Oct 18, 2026 | 6:40 PM

Share
ఉత్తరాంధ్ర ఇలవేల్పు విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 11 నుంచి ఆలయంలో అమ్మవారికి మొదలైన ప్రత్యేక పూజలు తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్నాయి. ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తున్నారు భక్తులు.

1 / 5
అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 20 వరకు ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు ఆదిలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా.. ఆ రోజు అమ్మవారికి స్వర్ణ కవచ అలంకరణలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఇక రెండవ రోజు ధనలక్ష్మిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా.. ఆ రోజు లక్ష చామంతుల అలంకరణలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఇక మూడవ రోజు ధాన్యలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారికి లడ్డూలతో పూజ చేశారు.

2 / 5
ఇక నాలుగవ రోజు ధైర్యలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా.. ఆ రోజు అమ్మవారికి తులసి పూజ నిర్వహించారు. ఐదవ రోజు సంతానలక్ష్మిగా అమ్మవారిని అలంకరించారు. కలువ పూజను కన్నుల పండువగా చేశారు. ఇక ఆరవ రోజు విద్యాలక్ష్మి అలంకారంలో శ్రీ పుష్పయాగాన్ని నిర్వహించారు. ఏడవ రోజు విజయలక్ష్మి అలంకారంలో గులాబీల పూజ చేశారు.

3 / 5
ఇక ఎనిమిదో రోజైన ఆదివారం అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా.. ఆ రోజు ఆలయంలో లక్ష గాజులతో అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

4 / 5
చివరి రోజైన ఈ నెల 20న అమ్మవారు కనకమహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆ రోజు స్వర్ణ కవచ అలంకరణలో అమ్మవారిని పూజించనున్నారు. 18 బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన నిర్వహిస్తారు. నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర నుంచే కాక రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

5 / 5
Follow Us
గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ

భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో..

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..

3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్

గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..

ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్ హీరోయిన్

పక్కా కొలతలతో ములక్కాడతో ఇలా పచ్చడి పెట్టారంటే

ఈ రూట్లో వందే భారత్ స్లీపర్ రైలు ఫిక్స్.. షెడ్యూల్ ఇదిగో..!

వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఈ ముగ్గురు ఔట్.. మరోసారి నో ఛాన్స్..?

నీళ్లను తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న..