AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యానికి ఎంత డార్క్ చాక్లెట్..! ఒక రోజులో ఎంత తినాలో తెలుసుకోండి..

డార్క్ చాక్లెట్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయాన్ని వైద్యనిపుణులు తరచూ చెబుతుంటారు. కానీ, ఏ డార్క్ చాక్లెట్ అని, ఎంత పరిమాణంలో ఆరోగ్యానికి మేలు చేస్తుందో మనకు ఎలా తెలుస్తుంది.. ఈ విషయాలు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలంటున్నారునిపుణులు. సాధారణంగా మార్కెట్లో లభించే చాక్లెట్లు ముదురు రంగులో ఉండవు. కోకో శాతం ఎంత మొత్తంలో ఉంటుందో  తెలియకపోవడంతో చాక్లెట్ల విషయంలో గందరగోళం ఉంటుంది. కాబట్టి ఏ చాక్లెట్ డార్క్ హెల్తీగా పనిచేస్తుంది..? ఒక రోజులో ఎంత చాక్లెట్ తినడం ఆరోగ్యకరమో తెలుసుకుందాం.

ఆరోగ్యానికి ఎంత డార్క్ చాక్లెట్..! ఒక రోజులో ఎంత తినాలో తెలుసుకోండి..
dark chocolate
Jyothi Gadda
|

Updated on: Feb 10, 2025 | 10:46 AM

Share

చాక్లెట్‌లో ఉపయోగించే కోకో మొక్క నుండి వస్తుంది. ఇందులో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి. కానీ మార్కెట్లో లభించే చాక్లెట్‌లో చక్కెర, పాలు, కోకో వెన్న, చాలా తక్కువ మొత్తంలో కోకో ఉంటాయి. కానీ డార్క్ చాక్లెట్‌లో కోకో ఎక్కువగా ఉంటుంది. చక్కెర తక్కువగా ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం, 70 నుండి 85 శాతం కోకో కలిగిన 101 గ్రాముల చాక్లెట్ బార్‌లో దాదాపు 8 గ్రాముల ప్రోటీన్, దాదాపు 11 శాతం డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇందులో 12 mg ఇనుము, 230 mg మెగ్నీషియం ఉంటాయి.

మెడికల్ న్యూస్ టుడే అధ్యయనం ప్రకారం, రోజుకు 20 నుండి 30 గ్రాముల డార్క్ చాక్లెట్ తినవచ్చు. కోకో ఎంత ఎక్కువగా ఉంటే, అందులో ఫ్లేవనాయిడ్లు అంత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కనీసం 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉన్న చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

– మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది

ఇవి కూడా చదవండి

– టైప్ 2 డయాబెటిస్‌లో ప్రయోజనకరంగా ఉంటుంది.

– చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది

– అధిక రక్తపోటుకు డార్క్ చాక్లెట్ ప్రయోజనకరంగా ఉంటుంది.

– యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

– డార్క్ చాక్లెట్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

– డార్క్ చాక్లెట్‌లో ఉండే కోకో ఫ్లేవనాయిడ్లు ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్