AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pomegranate: వీరికి దానిమ్మ వేరీ డేంజర్…! ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.. తిన్నారంటే..

ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. ఇందులోని పోషకాలు విటమిన్ సి, కే, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్ లాంటి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి సమృద్ధిగా అందిస్తుంది. జీవక్రియ, రోగ నిరోధక శక్తి మెరుగుపరచడానికి సహకరిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి.. కణ విభజన, రక్త పోటును నియంత్రించడానికి కూడా కీలకపాత్ర వహిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మెరిపిస్తుంది. రక్తహీనతను తరిమికొట్టి.. ఎర్ర రక్త కణాల నిర్మాణానికి తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా దానిమ్మ ఎంతగానో సహకరిస్తుంది. దానిమ్మ.. పండు, తొక్క, గింజలు, పూలు అన్నీ పోషకాలను ఇచ్చేవే. కానీ, కొంతమందికి దానిమ్మ సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయని తెలిస్తే మీరు షాక్‌ అవుతారు..దానిమ్మ ఎవరికి హానికరమో తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Feb 10, 2025 | 8:02 AM

Share
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. అలాగే, దానిమ్మలో లభించే పునికాలాజిన్ చర్మంలో కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఇది ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ముడతలను తగ్గిస్తుంది.

1 / 5
తక్కువ రక్తపోటు ఉన్నవారు- తక్కువ రక్తపోటు ఉన్నవారు కూడా దానిమ్మపండు తినకూడదు. ఎందుకంటే దానిమ్మపండు చల్లదనాన్ని కలిగిస్తుంది. ఇది మన శరీరంలో రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తక్కువ రక్తపోటుకు మందులు తీసుకునే వ్యక్తులు దానిమ్మపండు తినడం వల్ల హాని కలుగుతుంది. ఎందుకంటే అందులో ఉండే మూలకాలు ఔషధంతో చర్య జరుపుతాయి. ఇది శరీరానికి హాని కలిగిస్తుంది.

2 / 5
హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు ఉన్నవారు దానిమ్మ పండు తింటే రక్తపోటు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు దానిమ్మ పండు తీసుకోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రమవుతాయి. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండు తింటే హార్మోన్ల అసమతుల్యతకు గురవుతారు. దానిమ్మపండును ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు. ఎందుకంటే దీన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.

3 / 5
pomegranate

pomegranate

4 / 5
అజీర్ణ సమస్యలతో బాధపడేవారు దానిమ్మ పండు తింటే కడుపు ఉబ్బరం, అసౌకర్యం అనిపించే అవకాశం ఉంది. దానిమ్మలోని చల్లని స్వభావం కారణంగా, జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగదు. కాలేయ సంబంధ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండు తినడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం కలగవచ్చు. గ్యాస్ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండు తింటే గ్యాస్ మరింత పెరిగే ప్రమాదం ఉంది.

5 / 5