Health Tips: రోజుకు ఎన్నిసార్లు చేతులు కడుక్కోవాలి? ఎక్కువగా శుభ్రం చేసుకుంటే నష్టాలేంటి?
Health Tips: మన చర్మంలోని మొదటి పొరలో మనకు మేలు చేసే లక్షలాది బ్యాక్టీరియాలు ఉంటాయి. దీనితో పాటు, ఈ పొర నుండి సహజ నూనెలు బయటకు వస్తాయి. ఇవన్నీ కలిసి మన రోగనిరోధక శక్తిని..

మీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. చేతులు మురికిగా ఉన్నప్పుడల్లా చేతులు శుభ్రం చేసుకోవాలి. కానీ కొందరు చేతులు పదేపదే కడుక్కొంటారు. ఇది మంచి అలవాటు కాదంటున్నారు నిపుణులు. మరి రోజుకు ఎన్ని సార్లు చేతులను శుభ్రం చేసుకోవలో చూద్దాం. దీనికి సంబంధించి, సికె బిర్లా హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ తుషార్ తాయల్ మాట్లాడుతూ.. మీరు మీ చేతులను రోజుకు ఎన్నిసార్లు శుభ్రం చేసుకోవాలి..? మీ చేతులు ఎంత మురికిగా ఉన్నాయి ? మీరు ఎలాంటి పని చేస్తారు ? అనే దానిపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు, చాలా దుమ్ము ఉన్నప్పుడు మీరు మీ చేతులను శుభ్రం చేసుకోవాలి. మీరు బయటకు వెళ్లి ఎక్కువసేపు ఉంటే, మీ చేతులు ఖచ్చితంగా మురికిగా మారుతాయి. ఈ పరిస్థితిలో మీరు మీ చేతులను శుభ్రం చేసుకోవాలి. చేతులు శుభ్రపరచడానికి సూత్రం ఏమిటంటే, మీ చేతులపై మురికి కనిపిస్తే, మీరు మీ చేతులను శుభ్రం చేసుకోవాలి. లేకపోతే, మీరు బయటి వ్యక్తులతో పరిచయం ఏర్పడినప్పుడల్లా, మీ ముఖాన్ని తాకినప్పుడు, మీ చేతులను ముందుగా శుభ్రపరచుకోండి. అలాగే ఏదైనా తినే ముందు మీ చేతులను శుభ్రపరచుకోండి. లేదంటే శానిటైజ్ చేసుకోవడం మంచిదంటున్నారు. ఏదైనా మురిగిగా ఉన్నప్పుడు, మీరే చేసే పనిని బట్టి చేతులను శుభ్రం చేసుకోవడం అవసరం. అంతేగానీ ప్రతి దానికి చేతులు శుభ్రం చేసుకోవడం మంచి అలవాటు కాదంటున్నారు.
కొంతమంది తమ చేతులను చాలా తరచుగా శుభ్రం చేసుకుంటారు. అది ఇతరులకు ఆందోళన కలిగిస్తుంది. ఇది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే వ్యాధి అని డాక్టర్ తుషార్ తాయల్ చెప్పారు. ఇది ఒక మానసిక స్థితి. పదేపదే అనుమానంతో చేతులను శుభ్రం చేసుకునే వ్యక్తి తన ఆరోగ్యంపై కూడా అనుమానాలు ఉంటాయంటున్నారు. ఇది ఒక పోబియాలాగా. ప్రతి నిమిషానికి మనం చేతులు శుభ్రంగా ఉంచుకోకపోతే, మనకు అనారోగ్యం వస్తుందని భయపడిపోతుంటారు. కొంతమంది తమ ఇళ్లను 10 సార్లు కంటే ఎక్కువ శుభ్రం చేస్తారు. ఇంట్లోకి ఎవరైనా అడుగు పెట్టగానే వెంటనే ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెడతారు. ఇది వారి అనుమానం మాత్రమేనని అంటున్నారు.
తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల కలిగే నష్టాలు:
మన చర్మంలోని మొదటి పొరలో మనకు మేలు చేసే లక్షలాది బ్యాక్టీరియాలు ఉంటాయి. దీనితో పాటు, ఈ పొర నుండి సహజ నూనెలు బయటకు వస్తాయి. ఇవన్నీ కలిసి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది బాహ్య ఇన్ఫెక్షన్ల నుండి మనలను రక్షిస్తుంది. అలాంటప్పుడు మళ్లీ మళ్లీ చేతులు కడుక్కుంటే చర్మంలోని మొదటి పొర దెబ్బతినడంతోపాటు అనేక రకాల నష్టాలను చవిచూడాల్సి వస్తుందంటున్నారు. మొదటి పొర తొలగిపోయినట్లయితే ఏదైనా సూక్ష్మ జీవి మీ రక్తప్రవాహంలోకి సులభంగా ప్రవేశించి మీకు ఇన్ఫెక్షన్‌ని ఇస్తుంది. రెండవది మీరు తరచుగా చేతులు కడుక్కుంటే చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. దాని మెత్తదనం పోతుంది. చర్మం కూడా మళ్లీ మళ్లీ వాచిపోతుంది. అలాగే మీరు నొప్పిని కూడా అనుభవిస్తారు. అందువల్ల, అవసరమైనంత వరకు మాత్రమే చేతులు కడుక్కోవాలి. చేతులు మురికిగా కనిపించినప్పుడు మాత్రమే కడగాలి. చాలా అవసరాలను శానిటైజ్ చేయడం ద్వారా మంచిదంటున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)
