మీ ప్రాణం జర పైలం.. చేపలు తిన్న తర్వాత అస్సలే తినకూడని ఆహారాలు ఇవే!

Samatha

8 June 2026

చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు చాలా మంది ఇష్టంగా చేపలను తింటారు.

చేపలు

ముఖ్యంగా మృగశిర సమయంలో చేపలు తినడం తప్పనిసరి అని చెబుతారు. ఎందుకంటే? ఇవి అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.

మృగశిర

చేపలలో పోషకాలు పుష్కలంగా ఉండటం వలన ఇవి శరీరానికి మేలు చేస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే చేపలు ఆరోగ్యానికి మంచివే అయినా, వీటిని తిన్న తర్వాత కొన్ని ఆహారాలు అస్సలే తీసుకోకూడదంట.

పోషకాలు పుష్కలం

చేపలు తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పాలు తాగకూడదంట. దీని వలన జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతాయట.

పాలు తాగకూడదు

అలాగే చేపలు తిన్న తర్వాత పెరుగు, మజ్జిగ తీసుకోవడం కూడా అస్సలే మంచిది కాదు, ఇది చర్మ సమస్యలకు కారణం అవుతుంది.

పెరుగు, మజ్జిగ

కొందరు తెలిసి తెలియక, చేపలు తిన్న తర్వాత వెంటనే టీ లేదా కాఫీ తాగుతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.

టీ, కాఫీలు

చేపలు తింటూనే కొందరు చికెన్ లేదా మటన్ తింటుంటారు. కానీ ఇలా చేపలు తిన్న వెంటనే లేదా చేపలతో పాటు చికెన్, మటన్ అస్సలే తీసుకోకూడదు.

చికెన్ మటన్

అదే విధంగా కొంత మంది చేపల ఫ్రై లేదా చేపలతో చేసిన వంటకాలు తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినడం అలవాటు ఉంటుంది. కానీ ఇది అనేక సమస్యలకు కారణం అవుతుందంట.

ఐస్ క్రీమ్