High BP: హై బీపీ సమస్యని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఆ ప్రాణాంతక జబ్బులకు వెల్కం చెబుతున్నట్లే..

రక్తపోటు పెరుగుదల శరీరానికి ప్రమాదకరం. దీన్ని నియంత్రించుకోకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే చాలా మంది హైబీపీ సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారని.. హైబీపీ సమస్య ఉంటే మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టమని వైద్యులు చెబుతున్నారు. BP ని అదుపులో ఉంచుకోమని.. తరచుగా బిపీని చెక్ చేసుకుంటూ ఉండమని సూచిస్తున్నారు.

High BP: హై బీపీ సమస్యని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఆ ప్రాణాంతక జబ్బులకు వెల్కం చెబుతున్నట్లే..
High Blood Pressure
Follow us
Surya Kala

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 02, 2024 | 6:08 PM

మధుమేహం మాదిరిగానే అధిక రక్తపోటు వ్యాధి కూడా వేగంగా పెరుగుతోంది. ICMR ప్రకారం దేశంలో హై బీపీ రోగుల సంఖ్య 20 కోట్లకు పైగా ఉంది. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా యువత కూడా ఈ సమస్యను ఎదుర్కొంటోంది. రక్తపోటు పెరుగుదల శరీరానికి ప్రమాదకరం. దీన్ని నియంత్రించుకోకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే చాలా మంది హైబీపీ సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారని.. హైబీపీ సమస్య ఉంటే మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టమని వైద్యులు చెబుతున్నారు. BP ని అదుపులో ఉంచుకోమని.. తరచుగా బిపీని చెక్ చేసుకుంటూ ఉండమని సూచిస్తున్నారు.

గురుగ్రామ్‌లోని నారాయణ హాస్పిటల్‌లోని కార్డియాక్ సర్జన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రచిత్ సక్సేనా ఈ విషయంపై మాట్లాడుతూ అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్య ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తోంది. గుండెపోటుకు అధిక బీపీ ప్రధాన కారణం. అటువంటి పరిస్థితిలో హై బీపీ సమస్య ఉన్నట్లయితే.. అలసటగా అనిపిస్తున్నా లేక ఛాతీ నొప్పిగా అనిపించినట్లయితే, ముందుగా ECG చేయించుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. గుండె జబ్బులను గుర్తించడానికి ఉపయోగించే ECG ద్వారా హృదయ స్పందన గురించి తెలుస్తుంది. నేటి యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా గుండె జబ్బులను కూడా సకాలంలో గుర్తించవచ్చు.

ఏ పరీక్షలు చేయించుకోవాలంటే

ఇవి కూడా చదవండి

శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లోని ఇంటర్వెన్షనల్, క్లినికల్, క్రిటికల్ కార్డియాలజీ,ఎలక్ట్రోఫిజియాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అవినాష్ బన్సాల్ మాట్లాడుతూ దేశంలో అధిక జనాభా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని చెప్పారు. అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు సంభవిస్తుంది. అయినా ప్రస్తుతం ఎక్కువ మంది ఈ సమస్యను విస్మరిస్తున్నారు. సాధారణ పరీక్షల ద్వారా మాత్రమే ఈ వ్యాధిని గుర్తించవచ్చు. ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒకసారి తమ గుండెను పరీక్షించుకోవాలని సూచించారు. దీని కోసం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, చెస్ట్ సీటీ స్కాన్ చేయించుకోవచ్చు. అధిక BP బాధితులు అయితే ప్రతి రెండు రోజులకు ఒకసారి రక్తపోటును చెక్ చేసుకోవాలి. BP ఎల్లప్పుడూ 120/80 mmHg కంటే తక్కువగా ఉండాలి. ఇది మరింత పెరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉండకండి

ఎలా రక్షించుకోవాలంటే

గుండె జబ్బులను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఇండియన్ స్పైనల్ ఇంజ్యూరీస్ సెంటర్ కార్డియాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ అసిమ్ ధాల్ అంటున్నారు. దీని కోసం మిమ్మల్ని మీరు సమయానికి తనిఖీ చేసుకోండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వలన గుండె ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.