ఈ మొక్కను పెంచితే ఇంట్లో డబ్బులే డబ్బులు..

Velpula Bharath Rao

20 December 2024

22 December 2024

మనీ ప్లాంట్ మొక్కను ఆఫీస్‌, ఇండ్లలో దర్శనమిస్తూ ఉంటాయి. అసలు ఎందుకు ఆ మొక్కను బాగా నమ్ముతారు? ఆ మొక్క చేసే మేలు ఏంటి?

 నిజానికి ఈ మొక్క మట్టి, నీటిలో ఈజీగా నాటవచ్చు. చాలా మందికి ఈ మొక్క ఎలా పెంచాలో తెలియక సతమతమవుతారు. ఈ మొక్క పెంచేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటిస్తే పెరుగుతుంది.

ఈ మనీ ప్లాంట్‌ను నేల, నీటిలో రెండు చోట్ల పెంచవచ్చు. మొక్కను నీటితో పోలిస్తే మట్టిలో నాటడం మంచిది. నాటిన మొక్కకు ఎక్కువగా ఎరువులు వేయడం మంచిది కాదు.

మొక్కకు ఎక్కువగా ఎరువులు వేయడం వల్ల కుళ్లిపోయే అవకాశం ఉంది. కొంతమంది నీటిలో కూడా ఈ మనీ ప్లాంట్‌ను పెంచుతూ ఉంటారు. ఒకవేళ మీరు అలా చేస్తే మాత్రం ఆ ప్రతిరోజు నీటిని మార్చడం మంచిది.

మనీ ప్లాంట్‌ను నాటిన బాటిల్‌లో యాస్పిరిన్ టాబ్లెట్‌ను వేయడం వల్ల మొక్క చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. నీటితో పోలిస్తే మట్టిలో మనీ ప్లాంట్ త్వరగా పెరుగుతుంది. 

మట్టిలో మొక్కను పెంచితే అది డైరెక్ట్ సన్‌లైట్ తగిలేలా ఉంచకండి. మొక్కకు తేమను అదుపులో ఉండడానికి  వర్మి కంపోస్ట్, కోకో పీట్ వంటివి ఉపయోగించవచ్చు.

ఒకవేళ మనీ ప్లాంట్ ఎండిపోతే ఇంట్లో ఆనందం, సంతోషం ఆవిరి అయిపోతుందని పలువురు భావిస్తూ ఉంటారు. అందుకే మొక్కను ఎండిపోకుండా చూసుకోవాలి.

మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిశలో కాకుండా ఆగ్నేయ దిశలో పెంచుకోవడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందులు, డబ్బు సమస్యలు ఉండవు.