Telangana: ఆ ఊరంతా లారీలే .. అందరూ డ్రైవర్లే.. ఎందుకంటే..?

ఆ ఊరంతా లారీలే .. అందరూ డ్రైవర్లే .. ప్రతి ఇంటిలోనూ పోలీస్ లేక రక్షణ దళంలో పనిచేస్తున్నవారు ఉన్నారని వింటాం. కానీ ఆ ఊర్లో మాత్రం అందరూ డ్రైవర్లే.. ఒకే ఊళ్లో ఇంతమంది లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లుగా ఉండటం ఏంటి? ఈ ప్రత్యేకత కలిగిన గ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలి?

Telangana: ఆ ఊరంతా లారీలే .. అందరూ డ్రైవర్లే.. ఎందుకంటే..?
Full Of Lorrys And Drivers
Follow us
M Revan Reddy

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 22, 2024 | 10:46 AM

ప్రతి ఊరుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా ఊరంతా కవలలు.. ఊరంతా ఐటీ ఉద్యోగులు, ఊళ్లో ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు ప్రభుత్వం ఉద్యోగం లేకపోతే ప్రతి ఇంటిలోనూ పోలీస్ లేక రక్షణ దళంలో పనిచేస్తున్నవారు ఉన్నారని వింటాం. కానీ ఆ ఊరికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఆ ఊరు నిండా లారీలే… అందరూ డ్రైవర్లే. ఒకే ఊళ్లో ఇంతమంది లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లుగా ఉండటం ఏంటని..? ఈ ప్రత్యేకత కలిగిన గ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో 130 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 100కు పైగా కుటుంబాలు గత 50 ఏళ్లుగా లారీ పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఆ ఊరంతా లారీ డ్రైవర్లు ..లారీ ఓనర్లే. ఆ ఊరిలో ఎవరిని కదిలించినా మా అన్నయ్య డ్రైవర్, మా నాన్న, తమ్ముడు డ్రైవర్లే..వారికి లారీలు ఉన్నాయని చెబుతారు. ఇలా గ్రామంలో ప్రతి ఇంట్లోనూ లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లుగా పని చేస్తున్నవారే ఉన్నారు. మరి కొందరు డ్రైవరు వృత్తిగా జీవనోపాధి పొందుతున్న వారే కన్పిస్తారు. ఆటోలతో పాటు లారీలు, ట్రాక్టర్లు, డీసీఎంలు, టాటా సుమో, తవేరా, తుపాన్‌ వంటి అనేక వాహనాలు ఇక్కడ కనిపిస్తాయి. వీటిని అద్దెకు నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తుంటారు. ఈ ఊరిలో కొన్ని కుటుంబాల్లో ఒక్కరికి రెండు నుండి నాలుగు వరకు లారీలు ఉన్నాయి. ఇక్కడి వారు మొదట క్లీనర్‌గా పని చేసిన వారు డ్రైవర్లుగా మారడం, ఆ తర్వాత లారీ యజమానులుగా మారి లారీ ఓనర్ కమ్ డ్రైవర్‌గా ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపాన ఈ గ్రామం ఉండడంతో ఇక్కడి వారు లారీలతో ఉపాధి పొందుతున్నారు. ఇలా అల్లందేవి చెర్వు గ్రామం ప్రత్యేకత చాటుకుంటోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి