Tollywood: రూ.5 కోట్లు పెట్టి 54 కోట్లు సంపాదించిన హీరోయిన్.. ఆ ఒక్క కంపెనీతో భారీగా లాభాలు..

సాధారణంగా సినీరంగంలోని తారలు వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు పలు కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టగా.. రూ.54 లాభాలు అందుకుంది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో తెలుసా.. ?

Tollywood: రూ.5 కోట్లు పెట్టి 54 కోట్లు సంపాదించిన హీరోయిన్.. ఆ ఒక్క కంపెనీతో భారీగా లాభాలు..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 22, 2024 | 9:30 AM

బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఒకప్పుటి స్టార్ డైరెక్టర్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుని నటిగా స్టార్ డమ్ అందుకుంది. కొన్నాళ్ల క్రితమే ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఒక్కో సినిమాకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఈ అమ్మడు కేవలం సినిమాలు, ప్రకటనల ద్వారానే కాకుండా పలు వ్యాపార రంగాల్లో భారీగా పెట్టుబడుల ద్వారా సంపాదిస్తుంది. ఇ-కామర్స్ కంపెనీ, స్టార్ మార్కెట్, పెద్ద పెద్ద కంపెనీలలో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు అందుకుంది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. దేశంలోని అత్యంత సంపన్న నటీమణులలో ఆమె ఒకరు. నివేదికల ప్రకారం 2020లో ఒక కంపెనీలో కోట్లలో పెట్టుబడి పెట్టింది అలియా. కానీ ఒక సంవత్సరంలోనే 11% లాభాలు పొందింది. ప్రముఖ కాస్మోటిక్ బ్రాండ్ లో రూ.4.95 కోట్లు పెట్టుబడిన అలియా.. ఒక ఏడాదిలోనే 11 రెట్లు ఎక్కువగా లాభం పొందింది. అంటే ఏడాదిలో రూ.54 కోట్లు లాభాలు అందుకుంది. అలియా అనేక ఇతర కంపెనీలలో కూడా పెట్టుబడి పెట్టింది.

అలియా ఎక్కువగా దుస్తులు, కాస్మోటిక్ బ్రాండ్స్ లో పెట్టుబడులు పెట్టింది. అలాగే 2017లో అలియా ఓ ఫ్యాషన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. ఈ సంస్థ అలియాకు వ్యక్తిగత స్టైలింగ్ సేవలను అందిస్తుంది. సొంతంగా సూపర్ బాటమ్స్, యాడ్ ఎ మమ్మ, ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ వంటి కంపెనీలు ఉన్నాయి.

ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అలియా. ఇందులో సీత పాత్రలో తనదైన నటనతో మెప్పించింది. గంగూబాయి కతియవాడి సినిమాలో ఆమె నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తుంది అలియా. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ను 2022లో పెళ్లి చేసుకుంది అలియా. వీరికి రాహా అనే కూతురు జన్మించిన సంగతి తెలిసిందే.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.5 కోట్లు పెట్టి 54 కోట్లు సంపాదించిన హీరోయిన్..
రూ.5 కోట్లు పెట్టి 54 కోట్లు సంపాదించిన హీరోయిన్..
ఓర్నీ... ఇంకో జన్మంటూ ఉంటే..ఇలా కుక్కలా పుట్టాలి..
ఓర్నీ... ఇంకో జన్మంటూ ఉంటే..ఇలా కుక్కలా పుట్టాలి..
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రోకోలి.. వారంలో ఒక్కసారైనా
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రోకోలి.. వారంలో ఒక్కసారైనా
ఓర్నాయనో.. ఇలా తయారయ్యారెంట్రా.. జాబ్ పేరిట మహిళకు ఫోన్.. చివరకు
ఓర్నాయనో.. ఇలా తయారయ్యారెంట్రా.. జాబ్ పేరిట మహిళకు ఫోన్.. చివరకు
6 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన దమ్మున్నోడు.. కెరీర్‌లో తొలిసారి
6 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన దమ్మున్నోడు.. కెరీర్‌లో తొలిసారి
భార్యను పరిచయం చేసిన హీరో శ్రీసింహ..
భార్యను పరిచయం చేసిన హీరో శ్రీసింహ..
ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెల్ల పసుపు వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
తెల్ల పసుపు వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు చూస్తే..
సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు చూస్తే..
మరో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్.. మాములోడు కాదుగా
మరో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్.. మాములోడు కాదుగా