AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Steroids Side Effects: కోవిడ్‌ టైంలో తీసుకున్న స్టెరాయిడ్స్‌ వల్ల అనర్ధాలు.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న యువత

ఐదేళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కోవిడ్.. పేరు వింటే ప్రపంచ దేశాలకు ఇప్పటికీ వెన్నులో వెనుకే. కోవిడ్ వైరస్ నుంచి బయటపడటానికి తీసుకున్న స్టెరాయిడ్స్ ఇప్పుడు యువత శరీరంలో పలు అనర్ధాలకు దారి తీస్తుంది. ఎప్పుడో 60 ఏళ్లకు రావల్సిన నడుం నొప్పి, కీళ్ల నొప్పులు పాతకేళ్లకే రావడంతో అనేక మంది యువతీ యువకులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు..

Steroids Side Effects: కోవిడ్‌ టైంలో తీసుకున్న స్టెరాయిడ్స్‌ వల్ల అనర్ధాలు.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న యువత
Steroids Side Effects
Srilakshmi C
|

Updated on: Jan 20, 2025 | 1:16 PM

Share

కరోనా వైరస్ పేరు వింటేనే ఇప్పటికీ ఒంట్లో కంగారు పడుతుంది. జనజీవనాన్ని అంతగా ప్రభావితం చేసిన కోవిడ్ ప్రభావం ఇప్పటికీ యువతపై కనిపిస్తోంది. కోవిడ్ కారణంగా నేటి తరం యువతలో మోకాళ్లు, వెన్నెముక నొప్పులకు పరోక్షంగా బాధ్యత వహిస్తుంది. కరోనా సమయంలో చికిత్స కోసం తీసుకున్న స్టెరాయిడ్‌ వల్ల యువతలో నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ విషయంలో, ప్రాణాలను కాపాడటానికి, వైరస్‌తో పోరాడటానికి స్టెరాయిడ్లను అధిక మొత్తంలో ఉపయోగించారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. గత కొద్ది రోజులుగా మోకాళ్ల నొప్పులతో సహా కాళ్ల నొప్పులు, తుంటి నొప్పి, నడుము నొప్పి వంటివి యువకులు, వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగింది. యువతలోనూ మోకాళ్లు, తుంటి నొప్పులు పెరుగుతూనే ఉన్నాయి. స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడడమే ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కాలు, తుంటి, వెన్నునొప్పి ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు

కోవిడ్ సమయంలో ప్రాణాలను రక్షించడంలో సహాయపడిన స్టెరాయిడ్ ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వల్ల కాళ్లు, తుంటి, నడుము నొప్పి వస్తున్నాయి. కావున యువతలో కాలు, తుంటి, నడుము నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మితిమీరిన స్టెరాయిడ్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి?

వృద్ధులలో మోకాళ్ల నొప్పులు, తుంటి నొప్పి వంటివి సాధారణం. అయితే ఇప్పుడు తుంటి నొప్పి, మోకాళ్ల నొప్పుల కారణంగా 25 ఏళ్ల యువకులు, మహిళలు కూడా ఆస్పత్రికి వెళ్తున్నారు. కార‌ణాన్ని క‌నిపెట్టేందుకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా స్టెరాయిడ్స్ ఎక్కువ‌గా వినియోగించినట్లు రిపోర్టులు వచ్చాయి. అధిక స్టెరాయిడ్ వాడకం యువకులలో మృదులాస్థి నష్టానికి దారితీస్తుంది. ఇది ఆర్థరైటిస్‌ను కూడా నివారిస్తుంది. వీటివల్ల శరీర ఎముక, కాల్షియం, విటమిన్ డి బలహీనపడుతుంది. స్టెరాయిడ్ మందులు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలో ఎముకల పటుత్వం తగ్గిపోయింది. దీని వల్ల నడుము, మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..

ఇవి కూడా చదవండి

విక్టోరియా ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ విభాగానికి వృద్ధుల సంఖ్యతో పాటు యువకులు కూడా చికిత్స కోసం అధిక సంఖ్యలో వస్తున్నారు. బెంగళూరు మెడికల్ కాలేజీ డీన్ డా రమేష్ కృష్ణ ఈ మేరకు సమాచారం అందించారు. మితిమీరిన స్టెరాయిడ్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఆయన తెలియజేసారు. జాగ్రత్త అవసరమని హెచ్చరించారు. కూర్చోవడంలో ఇబ్బంది, మెట్లు దిగడం, నడిచేటప్పుడు విపరీతమైన నడుం నొప్పి వంటివి తలెత్తితే నిర్లక్ష్యం చేయకూడదు. మొదటి దశలో నొప్పి మందుల ద్వారా ఉపశమనం పొందవచ్చు. నిర్లక్ష్యం చేస్తే హిప్ రీప్లేస్‌మెంట్ లేదా మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.