- Telugu News Photo Gallery Have these breakfasts for your kids to be strong and tall, Check Here is Details in Telugu
Kids Care: మీ పిల్లలు బలంగా, పొడుగ్గా ఉండాలంటే ఈ బ్రేక్ ఫాస్ట్స్ పెట్టండి..
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అది తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే వారికి హెల్దీ ఫుడ్స్ అందిస్తే.. వారి బాడీ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్‌కి సహాయ పడుతుంది. కాబట్టి మార్నింగ్ స్కూల్‌కి వెళ్లే ముందు ఈ ఆహారాలను అందించండి. అవేంటో ఇప్పుడు చూసేయండి..
Updated on: Jan 20, 2025 | 12:57 PM

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతీ పేరెంట్స్ కోరుకుంటారు. ఇతరుల పిల్లల కంటే యాక్టీవ్‌గా ఉండాలని, అన్నింట్లో ముందు ఉండాలని, బలంగా ఉండాలని అనుకుంటారు. పిల్లలు అలా తయారవ్వాలంటే అందుకు మంచి పోషకాహారం అందించాలి. మార్నింగ్ స్కూల్‌కి వెళ్లే ముందు ఈ బ్రేక్ ఫాస్ట్ వాళ్లకు బలంగా తయారవుతారు.

పిల్లల ఇష్టాలను బట్టి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌గా ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్ అయినా వేసి పెట్టండి. గుడ్డులో ప్రోటీన్, ఫైబర్‌తో పాటు ఇతర పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. పిల్లలు యాక్టీవ్‌గా ఉండటంతో పాటు బలంగా తయారవుతారు.

ఓట్ మీల్ వంటి ఆహారాలను అందించాలి. ఇందులో అన్ని రకాల పోషకాలు పుష్కలంగా అందుతాయి. మార్నింగ్ స్కూల్‌కి వెళ్లే ముందు పెడితే.. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. బ్రెయిన్ కూడా యాక్టీవ్‌గా మారుతుంది.

డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఉదయం పూట పిల్లలకు బ్రేక్ ఫాస్ట్‌లా పెట్టవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్‌లో కూడా అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ఇవి పిల్లల్ని బలంగా ఉండేలా, హైట్ పెరిగేలా, బ్రెయిన్ డెవలప్మెంట్‌కి సహాయ పడతాయి.

కొద్దిగా నెయ్యి వేసి రాగి జావ కూడా పిల్లలకు బ్రేక్ ఫాస్ట్‌లా అందించవచ్చు. ఇది తాగితే అలసట, నీరస పడకుండా ఉంటారు. అన్ని రకాల పోషకాలు కూడా చక్కగా అందుతాయి. అలాగే ఇడ్లీ, దోశ, ఎగ్ సాండ్‌విచ్, పన్నీర్‌తో చేసిన రెసిపీలు పెట్టవచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




