Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యాభర్తల మధ్య గ్యాప్ రావొద్దంటే ఇలా చేయండి..! బంధం బలపడుతుంది..!

నేటి ఆధునిక జీవనశైలి చాలా వేగంగా సాగుతోంది. ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు, సామాజిక ఒత్తిళ్లు.. ఇవన్నీ కలిసి దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తుంటే.. ఒకరితో ఒకరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా సమయం కేటాయించలేరు. ఇలా మాట్లాడే సమయం లేకపోవడం కూడా బంధానికి దూరం కావడానికి ఒక కారణం అవుతుంది.

భార్యాభర్తల మధ్య గ్యాప్ రావొద్దంటే ఇలా చేయండి..! బంధం బలపడుతుంది..!
Happy Couple
Follow us
Prashanthi V

|

Updated on: Jun 08, 2025 | 9:56 PM

తరచూ గొడవలు లేకపోయినా, మాటలు లేకపోవడం లేదా సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా బంధం బలహీనపడే అవకాశం ఉంటుంది. అయితే వీటిని ప్రతిరోజూ కొన్ని చిన్న అలవాట్లతో సులభంగా ఎదుర్కోవచ్చు. ఇవి ప్రేమను పెంచడమే కాదు, సంబంధాన్ని మరింత గాఢంగా మార్చడంలో సహాయపడతాయి. ఇలాంటి రోజువారీ ఐదు ముఖ్యమైన అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీ రోజు ఎంత కష్టంగా గడిచిందో, ఎన్ని సమస్యలు ఎదురయ్యాయో పక్కనపెట్టి, ఇంటికి వచ్చి జీవిత భాగస్వామిని నవ్వుతూ హత్తుకోవడం ఎంతో శక్తివంతమైన భావోద్వేగ సంబంధాన్ని పెంపొందిస్తుంది. కొన్ని క్షణాల హత్తుకోలు మాటల్లో చెప్పలేని ప్రేమను వ్యక్తపరచడమే కాకుండా మానసికంగా ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. ఈ చిన్న అలవాటు రోజూ కొనసాగితే బంధం బలపడే అవకాశం పెరుగుతుంది.

రాత్రి భోజనం అయిన తర్వాత టీవీ చూస్తూ గడిపేయకూడదు. దానికంటే కొన్ని నిమిషాలు ఒకరితో ఒకరు నిశ్శబ్దంగా కూర్చుని మాట్లాడుకోవడం మంచిది. ఈరోజు పని ఎలా సాగింది..? ఎమోషనల్‌ గా ఏమైనా అనిపించిందా..? అనే ప్రశ్నలు ఒక పాజిటివ్ అనుభూతిని కలిగిస్తాయి. ఈ చిన్న సంభాషణలు ఒకరిపట్ల ఒకరికి విశ్వాసాన్ని బలపరుస్తాయి.

ఉదయం లేచిన వెంటనే ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపించడం చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు నీకు ఎలాంటి పనులు ఉన్నాయి..? ఏమైనా సహాయం కావాలా..? అనే ప్రశ్నలు అడగడమే కాదు.. మనకు వారిపట్ల గౌరవం ఉందని తెలిపే సంకేతం. ఇది కమ్యూనికేషన్‌ ను మెరుగుపరచడమే కాకుండా భావోద్వేగ అనుబంధాన్ని పెంచుతుంది.

గుడ్ మార్నింగ్, బై చెప్పే అలవాటు.. ఈ చిన్న మాటలు కనిపించడానికి సులభంగానే ఉంటాయి. కానీ రోజూ ప్రేమతో గుడ్ మార్నింగ్ చెప్పడం లేదా బయలుదేరేటప్పుడు బై, జాగ్రత్త అనడం అంటే వారు మన మనసులో ఎంత స్థానం కలిగి ఉన్నారో చెప్పే మాటలు అవుతాయి. ముఖ్యంగా బిజీ రోజుల్లోనూ ఈ మాటలు సంబంధాన్ని ప్రేమతో నింపుతాయి.

నిద్రకు ముందు నేడు ఈ విషయం చాలా బాగా జరిగింది అని పంచుకోవడం ఆనందాన్ని పెంచుతుంది. ఇది మన రోజును పాజిటివ్‌ గా ముగించే ఒక మార్గం. అలాగే ఇద్దరికీ మంచి నిద్ర, మంచి భావనలు కలిగించే అనుభూతిని ఇస్తుంది.

ఈ ఐదు సాదాసీదా అలవాట్లతో మీరు మీ దాంపత్య బంధాన్ని మరింత బలపరచవచ్చు. ఇవి పెద్దగా సమయం తీసుకునే పనులు కావు. కానీ ఇవి జీవిత భాగస్వామికి మీరు ఇచ్చే ప్రేమను, అర్థాన్ని ప్రతిరోజూ గుర్తు చేస్తాయి.