AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర‌టి పండు, స్ట్రాబెర్రీల‌ను క‌లిపి తీసుకుంటే.. శరీరంలో జరిగే మ్యాజిక్‌ ఏంటో తెలిస్తే..

బనానా-స్ట్రాబెర్రీ ..ఈ రెండు మంచి డైట్ ఫుడ్..ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఈ రెండు పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, మాంగనీస్, ప్రోటీన్‌ , ఫైబర్ తో సహా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా నిండి ఉంటాయి.

అర‌టి పండు, స్ట్రాబెర్రీల‌ను క‌లిపి తీసుకుంటే.. శరీరంలో జరిగే మ్యాజిక్‌ ఏంటో తెలిస్తే..
Banana
Ravi Kiran
|

Updated on: Jun 09, 2025 | 7:25 AM

Share

బనానా-స్ట్రాబెర్రీ ..ఈ రెండు మంచి డైట్ ఫుడ్..ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఈ రెండు పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, మాంగనీస్, ప్రోటీన్‌ , ఫైబర్ తో సహా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా నిండి ఉంటాయి. అయితే స్ట్రాబెర్రీ-బనానాలను విడి విడిగా కాకుండా కలిపి ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మరిన్ని వండల్ ఫుల్ హెల్త్ బెన్‌ఫిట్స్‌ను తమ సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకు మంచి బెనిఫిట్స్‌ ఉన్నాయని అంటున్నారు. వీటిని కలిపి ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా ఒక అరటి పండు, ఒక స్ట్రాబెర్రీ పండు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ ముక్కలు, అరటి పండు ముక్కలు, ఒకటిన్నర గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్‌, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో అర స్పూన్ అవిసె గింజల పొడి, వన్ టేబుల్ స్పూన్ బాదం పలుకులు, సన్నగా తరిగిన స్ట్రాబెర్రీ, బనానా ముక్కలను వేసి కలిపితే స్మూతీ అవుతుంది.

ఈ హెల్తీ స్మూతీని వారంలో మూడు, నాలుగు సార్లు తీసుకుంటే, మెమరీ పవర్ పెరుగుతుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. పొట్టలో అల్సర్ నుంచి విముక్తి లభిస్తుంది. నీరసం, అలసట వంటివి దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే జీర్ణ వ్యవస్థ పని తీరు సైతం మెరుగుపడుతుంది..గర్భంతో ఉన్న మహిళలకు ఇది మంచిది.బిడ్డ ఎదుగుదలకు కావలసిన అన్నీ ఇందులో ఉన్నాయి.స్ట్రాబెర్రీ ల వల్ల రక్తం వృద్ధి చెందుతుంది.. స్మూతీ లా కాకున్నా అలానే తీసుకున్నా మంచి ఫలితాలు ఉన్నాయి.

Follow Us
పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ ప్రకటన
పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ ప్రకటన
ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి దారుణ హత్య.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమా
ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి దారుణ హత్య.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమా
హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. ఐపీఎల్‌ 2027 వరకు క్రికెట్‌కు దూరం?
హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. ఐపీఎల్‌ 2027 వరకు క్రికెట్‌కు దూరం?
టాలెంట్ ఉన్నా వెలుగులోకి రాలేకపోయిన ఏడుగురు క్రికెటర్లు వీళ్లే
టాలెంట్ ఉన్నా వెలుగులోకి రాలేకపోయిన ఏడుగురు క్రికెటర్లు వీళ్లే
జియో మెగా ఐపీవో సునామీ.. ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో స్పందన
జియో మెగా ఐపీవో సునామీ.. ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో స్పందన
అందుకే ఆ ఫ్లాప్ తర్వాత ఆ డైరెక్టర్‌తో సినిమా చేయలేదు..
అందుకే ఆ ఫ్లాప్ తర్వాత ఆ డైరెక్టర్‌తో సినిమా చేయలేదు..
ఐదు సూపర్‌ఫాస్ట్ రైళ్లలో కొత్త సేవలు.. ఏఐ టెక్నాలజీతో క్లీనింగ్..
ఐదు సూపర్‌ఫాస్ట్ రైళ్లలో కొత్త సేవలు.. ఏఐ టెక్నాలజీతో క్లీనింగ్..
నూనె పీల్చకుండా పెసర గారెలు ఇలా చేస్తే ఇంటిల్లి పాది లాగిస్తారు
నూనె పీల్చకుండా పెసర గారెలు ఇలా చేస్తే ఇంటిల్లి పాది లాగిస్తారు
బిగ్‌బాస్‌లో ఆ కంటెస్టెంట్ చాలా సైలెంట్.. కప్పు కూడా అతనికే
బిగ్‌బాస్‌లో ఆ కంటెస్టెంట్ చాలా సైలెంట్.. కప్పు కూడా అతనికే