Hair Care Tips: అమ్మమ్మకాలం నాటి అరటి హెయిర్ మాస్క్‌ని ట్రై చేయండి.. ఒత్తైన, మిలమిలా మెరిసే జుట్టు మీ సొంతం..
జుట్టు అంటే స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. అందుకనే జుట్టు సంరక్షణ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. రసాయనాలతో నిండిన వాటిని జుట్టు కోసం ఉపయోగించడానికి బదులు అమ్మమ్మల కాలం నాటి జుట్టు సంరక్షణ కోసం ఇంటి చిట్కాలు ట్రై చేయండి. అలా పూర్వకాలం నుంచి జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తున్న చిట్కా అరటిపండు. ఇది శరీరంలోని అనేక సమస్యలను వలనే జుట్టుకి సంబంధించిన సమస్యని కూడా పరిష్కరిస్తుంది.

మహిళలతో పాటు పురుషులకు కూడా తమ జుట్టు అంటే అమితమైన ఇష్టం. అందుకనే జుట్టుని చాలా ప్రత్యేకంగా చూసుకుంటారు. బిజీ జీవనశైలి కారణంగా, ప్రతి రెండవ వ్యక్తి జుట్టు రాలిపోవడం అనే సమస్యని ఎదుర్కొంటున్నారు. వెంటనే రకరకాల నూనెలను ఖరీదు చేసి ఉపయోగించడం మొదలు పెడతారు. అయితే జుట్టు సంరక్షణ కోసం మార్కెట్ లో దొరికే రసాయనాల పదార్ధాలకు బదులుగా అమ్మమ్మల కాలం నాటి జుట్టు సంరక్షణ టిప్స్ పాటించడం ఫలవంతం. కనుక ఈ రోజు ఇంట్లో తయారుచేసుకునే ఒక బెస్ట్ హెయిర్ మాస్క్ గురించి తెలుసుకుందాం..
దీనిని ఉపయోగించడం కూడా చాలా సులభం. దీని నుంచి అనేక ప్రయోజనాలను పొందుతారు. అదే అరటిపండు హెయిర్ మాస్క్. ఇది జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి అరటిపండులో విటమిన్లు, ఖనిజాలు, సహజ తేమ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక జుట్టు సంరక్షణలో బెస్ట్ అయిన ఈ అరటి పండు హెయిర్ మాస్క్ తయారీ విధానం తెలుసుకుందాం..
అరటిపండు హెయిర్ మాస్క్ తయారు చేయడానికి కావలసినవి:
- పండిన అరటిపండు-1
- తేనె- 1 టేబుల్ స్పూన్
- కొబ్బరి నూనె- 1 టేబుల్ స్పూన్
హెయిర్ మాస్క్ తయారీ విధానం: దీనిని తయారు చేయడానికి మూడు వస్తువులు మాత్రమే అవసరం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అరటిపండుని వేసి బాగా మెత్తగా గుజ్జు చేయండి. తర్వాత ఆ అరటిపండు గుజ్జులో తేనె, నూనె కలపాలి. .. ఈ మూడిటిని బాగా కలిపి మృదువైన పేస్ట్ గా తయారు చేసుకోవాలి.
హెయిర్ మాస్క్ అప్లై చేసే విధానం:
ఇప్పుడు ఈ అరటి పండు పేస్ట్‌ను జుట్టు చివర్లకు మొదట రాసుకుని.. తర్వాత తల మీద చర్మానికి తగిలే విధంగా జుట్టుకి అప్లై చేయండి. ఇలా రాసుకున్న జుట్టుని 30 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆపై తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. జుట్టికి అరటి పండు మాస్క్ ని అప్లై చేసిన మొదటిసారే దీని ప్రభావం కనిపిస్తుంది.
ఈ మాస్క్ వల్ల జుట్టుకి ఎలాంటి ప్రయోజనం లభిస్తాయంటే
పొడి జుట్టు నుంచి ఉపశమనం: జుట్టు చాలా పొడిగా ఉంటే ఈ సమస్య నివారణకు అరటిపండుతో చేసిన ఈ మాస్క్‌ను ఉపయోగించవచ్చు. నిజానికి అరటిపండు సహజమైన మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా, సిల్కీగా చేస్తుంది. కనుక ఫస్ట్ టైం అప్లై చేసినా జుట్టును సిల్కీగా చేస్తుంది.
జుట్టు బలంగా మారుతుంది: జుట్టు ఎక్కువగా రాలుతుందని బాధపడుతుంటే ఈ హెయిర్ మాస్క్‌ను ఉపయోగించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ హెయిర్ మాస్క్ లో విటమిన్లు ఎ, సి, ఇ ఉంటాయి. ఈ మాస్క్ జుట్టు మూలాలను బలపడేలా చేస్తుంది. తద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. కనుక ఈ హెయిర్ మాస్క్ ని ఎవరైనా ఉపయోగించవచ్చు.
చుండ్రు మాయం: వర్షాకాలం, వేసవి కాలంలో కూడా చాలా మంది చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో అరటిపండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు తలని శుభ్రపరుస్తాయి. చుండ్రును తగ్గిస్తాయి. కనుక ఎవరైనా చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. అరటిపండు హెయిర్ మాస్క్ ఉపయోగించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








