Heel Cracked: కాళ్ల పగుళ్ల సమస్యా.. ఇంటి చిట్కాలతోనే ఈజీగా తగ్గించుకోవచ్చు..

|

Jul 30, 2024 | 5:00 PM

చాలా మందికి వర్షా కాలం వస్తే కాళ్లు పగులతాయి. నీటిలో తడవడం, కాళ్లు కింద పెట్టి నడవడం వల్ల బ్యాక్టీరియా, క్రిములు ఎటాక్ చేస్తాయి. దీంతో కాళ్లు అనేవి పగులతాయి. అయితే ఇంకెంత మందికి మాత్రం కాలంతో సంబంధం ఉండదు. ఏ సమయంలోనే అయినా కాళ్లు అనేవి పగులతాయి. అవే తగ్గిపోతాయిలే అని చాలా మంది నిర్లక్ష్యం చేసి వదిలేస్తారు. కానీ ఈ సమస్య ఎక్కువైతే నడవడానికి కూడా ఇబ్బందిగా మారుతుంది. కాళ్లు చూడటానికి కూడా..

Heel Cracked: కాళ్ల పగుళ్ల సమస్యా.. ఇంటి చిట్కాలతోనే ఈజీగా తగ్గించుకోవచ్చు..
Heel Cracked Tips
Follow us on

చాలా మందికి వర్షా కాలం వస్తే కాళ్లు పగులతాయి. నీటిలో తడవడం, కాళ్లు కింద పెట్టి నడవడం వల్ల బ్యాక్టీరియా, క్రిములు ఎటాక్ చేస్తాయి. దీంతో కాళ్లు అనేవి పగులతాయి. అయితే ఇంకెంత మందికి మాత్రం కాలంతో సంబంధం ఉండదు. ఏ సమయంలోనే అయినా కాళ్లు అనేవి పగులతాయి. అవే తగ్గిపోతాయిలే అని చాలా మంది నిర్లక్ష్యం చేసి వదిలేస్తారు. కానీ ఈ సమస్య ఎక్కువైతే నడవడానికి కూడా ఇబ్బందిగా మారుతుంది. కాళ్లు చూడటానికి కూడా ఇబ్బందిగా ఉంటాయి. ముఖ్యంగా డ్రై స్కిన్, డయాబెటీస్, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యలను ఇంటి చిట్కాలతోనే పరిష్కరించుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

కలబంద:

ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా దీన్ని ఈజీగానే పెంచుకుంటున్నారు. కాళ్ల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడేవారు.. కలబంద గుజ్జును పగుళ్లపై రోజూ రాస్తూ ఉండండి. ఈ సమస్య ఎక్కువగా ఉంటే.. ఉదయం లేదా రాత్రి కూడా రాసుకోవచ్చు. బాగా ఆరాక కడిగేసుకోవచ్చు. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నువ్వుల నూనె – పసుపు:

కాళ్ల పగుళ్లతో ఇబ్బంది పడేవారు నువ్వుల నూనె, పసుపుతో కూడా తగ్గించుకోవచ్చు. ఈ రెండింటిలో కూడా యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి త్వరగా పగుళ్లను తగ్గిస్తాయి. అంతే కాకుండా చర్మాన్ని మెత్తబడేలా చేస్తుంది. రోజులో రెండు, మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

వంట సోడా:

వంట సోడాతో కిచెన్ హ్యాక్సే కాకుండా కాళ్ల పగుళ్ల సమస్యను కూడా తగ్గించవచ్చు. ముందుగా పాదాలను చక్కగా కడిగి.. ఆరనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని.. పాదాలపై వేసి స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉండే బ్యాక్టీరియా తగ్గుతుంది. అలాగే రక్త ప్రసరణ జరుగుతుంది. చర్మం కూడా మెత్తబడుతుంది.

కొబ్బరి నూనె:

కాళ్ల పగుళ్ల సమస్యను కొబ్బరి నూనెతో కూడా తగ్గించవచ్చు. పగుళ్లను తగ్గించడంలో కొబ్బరి నూనె చక్కగా హెల్ప్ చేస్తుంది. బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్‌ తగ్గించి.. చర్మాన్ని మెత్తబడేలా చేస్తుంది. పాదాలకు మంచి పోషణ అందిస్తుంది. గాయాలను కూడా త్వరగా నయం చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..