Life style: హై స్పీడ్ ఇంటర్నెట్‌తో ఊబకాయం.. ఎలాగనేగా మీ సందేహం
ప్రస్తుతం ఇంటర్నెట్ వేగం ఓ రేంజ్‌లో పెరిగింది. హైస్పీడ్ ఇంటర్నెట్ కారణంగా ఎన్ని లాభాలు ఉన్నాయో, అదే విధంగా నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..
ఒకప్పుడు ఇంటర్నెట్ వేగం చాలా పరిమితంగా ఉండేది. తక్కువ వేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేవి. అయితే ప్రస్తుతం ఇంటర్నెట్ స్పీడ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఈ వేగం కేవలం బ్రాడ్ బ్యాండ్ సేవలకు మాత్రమే పరిమితం కాకుండా మొబైల్‌లో కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. 5జీ రాకతో ఇది సాకారమైంది.
ఒకప్పుడు ఒక సినిమాను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సింది. కానీ ప్రస్తుతం క్షణాల్లో సినిమాలు డౌన్‌లోడ్ అవుతున్నాయి. బఫరింగ్ లేకుండా వీడియోలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇంటర్నెట్ వేగంతో లాభాలు ఉన్నట్లే నష్టాలు కూడా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్ వేగం కారణంగా ఊబకాయం సమస్య బారిన పడే అవకాశం ఉందని పరిశోధనల్లో వెల్లడైంది.
ఇంతకీ ఇంటర్నెట్ స్పీడ్‌కు ఊబకాయంకు మధ్య సంబంధం ఏంటనేగా మీ సందేహం. హైస్పీడ్ ఇంటర్నెట్ వినియోగం వల్ల నిశ్చల జీవనశైలి పెరుగుతోందని పరిశోధులు చెబుతున్నారు. దీంతో ప్రజలు ఎక్కువ సమయం స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మేరకు వారిలో శారీర శ్రమ ఉండడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ బిజినెస్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు పలు సంవత్సరాల హౌజ్‌హోల్డ్, ఇన్‌కం అండ్ లేబర్ డైనమిక్స్ ఇన్ ఆస్ట్రేలియా(హెచ్‌ఐఎల్‌డీఏ) డాటాను విశ్లేషించి ఈ విషయాన్ని తేల్చారు. ఇక హైస్పీడ్ ఇంటర్నెట్ కారణంగా ఒకే చోట ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం, చిరుతిళ్ల అలవాటు పెరగడం కూడా ఊబకాయంకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా శరీరంలోకి కేలరీ ఇన్‌టేక్ పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..