మీకూ ఏ పని చేయకపోయినా.. అలసిపోయినట్లు నిస్సత్తువగా అనిపిస్తుందా? ఐతే జాగ్రత్త..
కొంతమందికి చిన్న పని చేసిన నీరసంగా ఉంటుంది. నాలుగు అడుగులు నడిచినా కూడా కొండను పిండి చేసినంతగా అలసిపోతారు. సరిగ్గా తినకపోవడం, జ్వరం, జలుబు వంటి కారణాల వల్ల సాధారణంగా అలసిపోవడం సర్వసాధారణం. కానీ ఎటువంటి కారణం లేకుండా అలసిపోయినట్లు అనిపించడం..

కొంత మంది ఏ పని చేయకపోయినా విపరీతంగా అలసి పోతుంటారు. చిన్న పని చేసిన నీరసంగా ఉంటారు. నాలుగు అడుగులు నడిచినా కూడా కొండను పిండి చేసినంతగా అలసిపోతారు. సరిగ్గా తినకపోవడం, జ్వరం, జలుబు వంటి కారణాల వల్ల సాధారణంగా అలసిపోవడం సర్వసాధారణం. కానీ ఎటువంటి కారణం లేకుండా అలసిపోయినట్లు అనిపించడం, నీరసంగా అనిపించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీకూ ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే జాగ్రత్తగా ఉండటం మంచిది. అంతే కాకుండా వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి. కాబట్టి ఎలాంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం అవ్వాలో ఇక్కడ తెలుసుకుందాం..
రక్తహీనత
ఏ పని చేయకపోయినా మీరు అలసిపోయినట్లు అనిపిస్తే రక్తహీనతతో బాధపడుతున్నారని అర్థం. రక్తంలో తగినంత ఎర్ర రక్త కణాలు లేనప్పుడు శరీరం త్వరగా అలసిపోతుంది. ఎందుకంటే ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి ఎర్ర రక్త కణాలు అవసరం. అవి సరిపడా లేనప్పుడు అలసట త్వరగా వస్తుంది.
హైపోథైరాయిడిజం
హైపోథైరాయిడిజం కూడా అలసటకు ఒక కారణమని నిపుణులు అంటున్నారు. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు తగ్గినప్పుడు, అలసట ప్రారంభమవుతుంది. హార్మోన్లు తక్కువగా విడుదల కావడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. దీనిని హైపోథైరాయిడిజం అంటారు. ఫలితంగా శరీర కండరాలలో అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.
టైప్ 2 డయాబెటిస్
డయాబెటిస్ ఉన్నవారు త్వరగా అలసిపోయే అవకాశం ఉంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు తమ శరీరంలోని గ్లూకోజ్‌ను పూర్తిగా ఉపయోగించుకోలేరు. దీని వల్ల అలసట వస్తుంది.
డిప్రెషన్
త్వరగా అలసిపోవడానికి మరో కారణం డిప్రెషన్. ఈ సమస్య ఇటీవల యువతలో అధికంగా పెరుగుతోంది. శారీరక శ్రమ కంటే మానసిక ఒత్తిడి కారణంగా అలసిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. ఒత్తిడి కారణంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది.
కీళ్ళవాతం
శరీరం త్వరగా అలసిపోవడానికి మరో ప్రధాన కారణం ఆర్థరైటిస్. ఇది శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసి ఎముకలను మాత్రమే కాకుండా కణాలను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి శరీరం త్వరగా అలసటను అనుభవిస్తుంది.
నిద్రలేమి
సరిగ్గా నిద్రపోకపోయినా ఆరోగ్యం క్షీణిస్తుంది. అందువల్ల నిద్ర లేకపోవడం అలసటకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. రాత్రిపూట బాగా నిద్రపోకపోవడం వల్ల రోజంతా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. దీంతో ఎల్లప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








