Bed Sheet in Winter: చలిగా ఉందనీ.. నఖశిఖ పర్యంతం దుప్పటి తన్ని నిద్రపోతున్నారా? మీరీ విషయం తెలుసుకోవల్సిందే

చలికాలంలో చాలా మంది వెచ్చగా నిద్రపోవాలని అనుకుంటారు. కొందరైతే మందంగా ఉండే దుప్పట్లను ఒకటికి రెండు తీసుకుని కాళ్ల నుంచి తల వరకు మొత్తం ఫుల్ గా కప్పేసి నిద్రపోతుంటారు. ఈ అలవాటు మనలో చాలా మందికి ఉంది. అయితే ఇలా నిద్రపోవడం ఎంతో డేంజరని నిఫుణులు చెబుతున్నారు. నిజానికి ఇలా నిద్రపోవడం వల్ల..

Bed Sheet in Winter: చలిగా ఉందనీ.. నఖశిఖ పర్యంతం దుప్పటి తన్ని నిద్రపోతున్నారా? మీరీ విషయం తెలుసుకోవల్సిందే
Bed Sheet In Winter
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 31, 2024 | 12:54 PM

చలికాలం మొదలైంది. ఈ చలిలో వెచ్చగా నిద్రపోవాలని చాలా మందికి అనిపిస్తుంది. చలిలో శరీరాన్ని రక్షించుకోవడానికి చాలా మంది దుప్పట్లు, వెచ్చని స్వెటర్లను ఉపయోగిస్తారు. కానీ కొందరికి రాత్రి పడుకునేటప్పుడు తల నుంచి పాదాల వరకు బెడ్ షీట్ ఫుల్లుగా కప్పుకునే అలవాటు ఉంటుంది. కానీ ఇలా పడుకోవడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నిద్ర అలవాటు వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

చర్మానికి హానికరం

చలికాలంలో ముఖంపై బెడ్‌షీట్‌ వేసుకుని పడుకోవడం వల్ల మీరు శ్వాస నుంచి వెలువడే అపరిశుభ్రమైన గాలి బయటకు వెళ్లదు. ఈ చెడు గాలి చర్మం రంగు మారడానికి కారణమవుతుంది. అంతేకాకుండా చర్మం ముడతలు, మొటిమలు సహా ఇతర చర్మ సమస్యలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఊపిరితిత్తుల సమస్య

ముఖానికి దుప్పటి కప్పుకుని నిద్రించడం వల్ల ఊపిరితిత్తులకు గాలి అందదు. దీని వల్ల ఊపిరితిత్తులు సంకోచించుకుపోతాయి. ఇలాంటి అలవాటు వల్ల క్రమంగా తలనొప్పి, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది

నిండా దుప్పటి తన్ని నిద్రించడం వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం సరైన మోతాదులో ప్రవహించదు.

అలసట

ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోతే ఆక్సిజన్‌ అందదు. దీనివల్ల విపరీతమైన అలసట కలుగుతుంది. అంతే కాకుండా తలనొప్పి, వికారం, తల తిరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి.

జుట్టు రాలే సమస్య

తలపై దుప్పటి కప్పుకుని నిద్రించడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడి జుట్టు రాలడానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

నిద్రపోవడంలో ఇబ్బంది

తల నుండి కాలి వరకు దుప్పట్లు ధరించి నిద్రించే అలవాటు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీని కారణంగా శరీరానికి చెమటలు పట్టడం ప్రారంభిస్తుంది. దీనివల్ల నిద్ర సరిగా పట్టదు.

గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ

తల నుంచి కాలి వరకు దుప్పటి కప్పుకుని నిద్రించే అలవాటు వల్ల శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందదు. ఈ అలవాటుతో గుండెపోటు, శ్వాసకోశ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్