AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bed Bugs: నల్లులు నరకం చూపిస్తున్నాయా? ఇలా చేస్తే వాటిని నాశనం చేయొచ్చు..

మీరు వీటిని పగటిపూట చూసే అవకాశం లేదు. ఎందుకంటే వారు రాత్రిపూట మాత్రమే బయటకు కనిపిస్తాయి. పగటిపూట అవి పడకలలో దాక్కుంటాయి. దుప్పట్లు, బెడ్ షీట్‌లు, దిండ్లు, దిండు కవర్లు, హెడ్‌బోర్డ్‌లు వంటి వాటిని తమ నివాసాలుగా చేసుకుంటాయి.

Bed Bugs: నల్లులు నరకం చూపిస్తున్నాయా? ఇలా చేస్తే వాటిని నాశనం చేయొచ్చు..
Bed Bugs
Madhu
|

Updated on: Jun 08, 2023 | 6:00 PM

Share

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో ఇవి కనిపిస్తాయి. వాటిని గుర్తించి, జాగ్రత్తలు తీసుకున్నారా సరేసరి.. లేకుంటే మీ శరీరంలోని రక్తాన్ని పీల్చేస్తాయి. అనేక రకాల ఎలర్జీలకు కారణమవుతాయి. పగలంతా దాక్కొని.. రాత్రవ్వగానే డ్యూటీలోకి దిగుతాయి. ఇంతకీ అవేంటో మీకు అర్థం అయ్యిందా? అవేనండి రాత్రి పూట ప్రత్యక్ష నరకాన్ని చూపించే నల్లులు(బెడ్ బగ్స్). ఇవి చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ అవి పెట్టే బాధ అంతా ఇంతా కాదు. సరిగ్గా మీరు విశ్రాంతి తీసుకునే సమయంలో అవి పని మొదలు పెడతాయి. ఈ నేపథ్యంలో అసలు బెడ్ బగ్స్ జీవిత చక్రం ఏమిటి? అవి ఎలా ఎక్కడ బతుకుతాయి? ఎలా బతుకుతాయి? వాటి నివారణకు ఏం చేయాలి తెలుసుకుందాం..

బెడ్ బగ్స్ అంటే ఏమిటి?

బెడ్ బగ్స్ అనేది 1/4 అంగుళాల పొడవు మాత్రమే పెరిగే చిన్న కీటకాలు. వీటికి చదునైన పొత్తికడుపు ఉంటుంది. రెక్కలు లేవు. ఎర్రటి గోధుమ రంగులో ఉంటుంది. మీరు వీటిని పగటిపూట చూసే అవకాశం లేదు, ఎందుకంటే వారు రాత్రిపూట మాత్రమే బయటకు కనిపిస్తాయి. పగటిపూట అవి పడకలలో స్థిరపడతాయి. దుప్పట్లు, బెడ్ షీట్‌లు, దిండ్లు, దిండు కవర్లు, హెడ్‌బోర్డ్‌లు వంటి వాటిని తమ నివాసాలుగా చేసుకుంటాయి. అలాగే చెక్క పగుళ్లు, గోడ పగుళ్లలోనూ గుంపులుగా నివసిస్తాయి. ఈ కీటకాలు రక్తాన్ని తాగాతాయి. మనం రాత్రి సమయంలో నిద్రపోయే సమయంలో అవి మనుషులపై దాడి చేస్తాయి.

బెడ్ బగ్స్ ఎంతకాలం జీవిస్తాయి?

ఆడ బెడ్ బగ్‌లు తమ జీవితకాలంలో వందల కొద్దీ గుడ్లు పెట్టగలవు, ఇవి సాధారణంగా 10 నుండి 12 నెలల వరకు జీవిస్తాయి. దీని గుడ్డు చాలా చిన్నది, ఒక చిన్న దుమ్ము రేణువు లాంటిది. మనిషి కంటికి కనిపించవు. అయితే అవి పరిపక్వం చెందుతున్నప్పుడు, తమ చర్మాన్ని అనేకసార్లు తొలగించుకుంటుంది. ఆ చర్మ రేణువులను బట్టి వాటిని గుర్తించవచ్చు. బెడ్ బగ్‌లు అర్ధరాత్రి సమయం నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు చురుకుగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

నల్లుల నివారణకు ఇవి పాటించండి..

రూమ్‌లో సూర్య కిరణాలు పడాలి.. ఇళ్లలో తేమ అధికంగా ఉండటం, గాలి ప్రసరణ లేకపోవడం, అపరిశుభ్రత, గృహోపకరణాల నిల్వ వంటి కారణాల వల్ల నల్లుల సమస్య వస్తుంది. గదిలో సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలి. నల్లులను నిర్మూలించడానికి పరుపు, మంచాన్ని ఎండలో ఉంచాలి. నల్లులు వేడిని ఎక్కువగా తట్టుకోలేవు. ఆ వేడికి.. నల్లులు చాలా వరకు చచ్చిపోతాయి. మంచం లోపల వేసే ముందు.. ఓ క్లాత్‌తో క్లీన్‌ చేయాలి

వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయండి.. నల్లులు ఉన్న ప్రాంతాలను వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయండి. మంచాలు, సోఫాలు, కుర్చీలు వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో క్లీన్‌ చేయండి. ఫర్నీచర్ లేదా సీలింగ్‌లలో ఉండే పగుళ్లను మూసివేయండి.

శుభ్రంగా ఉండండి.. దుప్పట్లు, బెడ్‌కవర్స్, పిల్లో కవర్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. వీటిని వేడినీటితో ఉతికితే.. నల్లులు నాశనం అవుతాయి. వారానికి ఒకసారి దుప్పట్లు మార్చండి. 60 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద దుప్పట్లు క్లీన్‌ చేయండి.

ల్యావెండర్‌ ఆయిల్.. లావెండర్ నూనెకి నల్లులు నశిస్తాయి. ఈ నూనెలో ముంచిన వస్త్రంతో కుర్చీలు, మంచాన్ని తుడిస్తే నల్లులు నశిస్తాయి. అదేవిధంగా కొన్ని పుదీనా ఆకులను నల్లుల బెడద ఎక్కువగా ఉన్న చోట ఉంచితే నల్లుల సమస్యకు చెక్ పెట్టొచ్చు. మిరియాలు, యూకలిప్టస్ ఆయిల్ కూడా నల్లులను చంపడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..