AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ రాకుండా ఉండాలంటే.. భోజనం చేసిన వెంటనే ఇది చేయండి.. సింపుల్ కానీ చాలా పవర్ ఫుల్!

Walking Benefits: ప్రతి రోజూ కొద్ది నిమిషాలు నడక వల్ల చాలా అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. భోజనం తర్వాత కనీసం రెండు నిమిషాలు నడిచినా చాలు.. రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేందుకు సాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ రాకుండా నిరోధిస్తుంది. 

షుగర్ రాకుండా ఉండాలంటే.. భోజనం చేసిన వెంటనే ఇది చేయండి.. సింపుల్ కానీ చాలా పవర్ ఫుల్!
walking
Madhu
|

Updated on: May 04, 2023 | 1:45 PM

Share

వ్యాయామం మనిషికి అవసరం.. కాదు అనివార్యం. ప్రస్తుత ఆధునిక కాలంలో మనిషి ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి. చుట్టూ అనారోగ్య పరిస్థితులు ఉంటున్న నేపథ్యంలో స్వతహాగా శరీరానికి పని కల్పించి, దానిని ఆరోగ్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరి. ప్రధానంగా వాకింగ్ పై అధికంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యాయామం అంటే ఏదో పెద్ద బరువులు మోయాల్సిన అసవరం లేదు గానీ.. జస్ట్ ప్రతి రోజూ ఓ 15 నిమిషాలు వాకింగ్ మిమ్మల్ని అనేక రోగాల నుంచి బయటపడేస్తుంది. ముఖ్యంగా ఎక్కువ గంటలు కూర్చొని పనిచేసే వారు తప్పనిసరిగా దీనిని పాటించాల్సిందే. ఇటీవల కాలంలో అధికమవుతున్న క్రానిక్ వ్యాధుల నుంచి బయటపడేందుకు వాకింగ్ అత్యవసరంగా మారింది. భోజనం చేసిన తర్వాత అలా రిలాక్స్ అయిపోకుండా.. లేకుండా భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించకుడా కొద్ది నిమిషాలు నడిస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.

ప్రతి రోజూ కొద్ది నిమిషాలు నడక వల్ల చాలా అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. భోజనం తర్వాత కనీసం రెండు నిమిషాలు నడిచినా చాలు.. రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేందుకు సాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ రాకుండా నిరోధిస్తుంది. నడక మధుమేహానికి ఎలా ఉపయోగపడుతుందో పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా పంచుకున్నారు. ఆమె ఇలా పోస్ట్ చేశారు, ‘భోజనం తర్వాత గ్లూకోజ్ రక్తప్రవాహంలోకి విడుదల అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలలో చిన్న స్పైక్ ఏర్పడుతుంది. దీనివల్ల చిక్కులు అసాధారణమైనవి కానప్పటికీ, మధుమేహాన్ని నియంత్రించడంలో ఇది బాగా ఉపకరిస్తుంది’.

భోజనం తర్వాత వాకింగ్..

బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ఇటీవల గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి రోజుకు 11 నిమిషాల చురుకైన నడక(బ్రిస్క్ వాకింగ్) లేదా దానికి సమానమైన మితమైన-తీవ్రతతో కూడిన శారీరక శ్రమ సరిపోతుందని నిర్ధారించింది. వారానికి 75 నిమిషాల మితమైన వ్యాయామాలు చేయడం వల్ల ముందస్తు మరణాల ప్రమాదాన్ని 23% తగ్గించవచ్చని వారు కనుగొన్నారు. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని 17%, క్యాన్సర్ ప్రమాదాన్ని 7% తగ్గించడానికి కూడా ఇది సరిపోతుందని వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

భోజనం తర్వాత నడక సెరోటోనిన్‌ను విడుదల చేస్తుంది, ఇది మంచి నిద్రకు, మరింత నియంత్రిత ఆకలికి, సానుకూల మనస్తత్వాన్ని పెంచుతుంది మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

భోజనం తర్వాత నడిస్తే కలిగే ప్రయోజనాలు..

  • ప్రతిరోజూ కొద్ది నిమిషాలు నడిచినా చాలు.. అవి రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి.
  • అధ్యయనాల ప్రకారం, నడక హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • నడక కీళ్లను బలోపేతం చేయడానికి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
  • జీవక్రియను మెరుగుపరుస్తుంది, మానసిక స్థితిని పెంపొందిస్తుంది.
  • రోగనిరోధక వ్యవస్థ, కండరాలు, ఎముకలు మొదలైన వాటిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
  • రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్‌లతో సహా “సంతోషకరమైన హార్మోన్లను” విడుదల చేస్తుంది
  • పేగు ఆరోగ్యానికి కూడా నడక మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..