మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడని ఆరు ఆహార పదార్థాలు ఇవే !
కొంత మంది కొన్ని రకాల ఆహారపదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తింటుంటారు. కానీ ఇలా అస్సలే చేయకూడదు అంటారు వైద్యులు. ఎందుకంటే కొన్ని పదార్థాలను వేడి చేసి తినడం వలన అవి విషపూరితంగా మారి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుందంట. అందువలన ఎలాంటి ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడదో చూద్దాం.
Updated on: Jun 10, 2025 | 12:49 PM

మిగిలిపోయిన అన్నాన్ని కొంత మంది మరోరోజు వేడి చేసి తింటుంటారు. కానీ ఇలా అస్సలే చేయకూడదంట. రైస్ బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియాను కలిగి ఉంటుందంట. అందువలన అన్నాన్ని మళ్లీ మళ్లీ వేడి చెసినప్పుడు ఆ బ్యాక్టీరియ అనేది నాశనం కాకపోగా, ఎక్కువ అవుతుందంట. అంతే కాకుండా దీని వలన అన్న విషపూరితంగా మారే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట. అందుకే అన్నాన్ని పదే పదే వేడి చేయకూడదంట.

ఆకు కూరల్లో పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మంచి ప్రోటీన్స్, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అయితే కొంత మంది పాలకూరను పదే పదే వేడి చేసి తింటుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం అంట. దీని వలన ఇది విషపూరితంగా మారి, క్యాన్సర్‌కు దారి చేసే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు వైద్యనిపుణులు.

ఎగ్ కర్రీ లేదా ఉడికించిన కోడి గుడ్డును మళ్లీ మళ్లీ వేడి చేయకూడదంట. అధిక ఉష్ణోగ్రతల వద్ద మళ్లీ వేడి చేయడం వల్ల ప్రోటీన్లు జీర్ణం కావడం కష్టమవుతుందంట. ఇది విషపూరితంగా మారి జీర్ణసమస్యలను కూడా కలిగిస్తుందని చెప్తున్నారు వైద్యులు.

బంగాళ దుంపల కర్రీని కూడా పదే పదే వేడి చేయకూడదంట. దీని వలన క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెంది, అది విషపూరితంగా మారిపోతుందంట. అందుకే వీటిని అస్సలే వేడి చేసి తినకూడదు.

నాన్ వెజ్ ప్రియులు చికెన్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. అయితే ఇది సరిగ్గా ఉడకకపోతే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయంట. అందుకే దీనిని వండే క్రమంలోనే బాగా ఉండికించాలంట. కానీ తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేయకూడదంట. దీని వలన చాలా సమస్యలు వస్తాయంట.



















