Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gut Health Tips: మీ కడుపును శుభ్రం చేసే సూపర్ ఫుడ్స్ ఇవే.. కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు పరార్..

కడుపులో ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆ సమయంలో చాలా అనీజీగా ఉంటుంది. ఏ పనిని సక్రమంగా చేయనివ్వదు. అందుకని దానిని నివారించడం అవసరం. అందుకే మొత్తం మీ పేగుల ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచే ఆహారపదార్థాలను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాం.

Gut Health Tips: మీ కడుపును శుభ్రం చేసే సూపర్ ఫుడ్స్ ఇవే.. కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు పరార్..
Gut Health
Follow us
Madhu

|

Updated on: Apr 17, 2023 | 5:00 PM

ఈ రోజు కడుపు బాగోలేదురా.. ఏదో అనీజీగా ఉంది.. అని చాలా మంది అంటుంటారు. ప్రతి ఒక్కరికీ ఇదే సాధారణమే. తరచూ కడుపు నొప్పిగా ఉంటుండటం కూడా జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం తిన్నది అరగక పోవడం, కడుపు ఉబ్బరంగా ఉండటం. వీటి వల్ల వాంతులు, అతిసారం, మలబద్ధకం వంటివి వస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో సాధారణంగా పొత్తి కడుపు నొప్పిగా ఉంటుంది. ఇది పెద్ద వ్యాధికాకపోయినా.. ఆ సమయంలో చాలా ఇబ్బందిని కలుగజేస్తుంది. ఏ పనిని సక్రమంగా చేయనివ్వదు. అందుకని దానిని నివారించడం అవసరం. అందుకే మొత్తం మీ పేగుల ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచే ఆహారపదార్థాలను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాం. ప్రముఖ పోషకాహార నిపుణులు లోవనీట్ బాత్రా ఈ సూపర్ ఫుడ్స్ గురించి వివరిస్తున్నారు. ఫైబర్ లేదా కొవ్వు పదార్థాలు నివారించడం ద్వారా కడుపు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. సులభంగా జీర్ణమయ్యే సాధారణ కార్బోహైడ్రేట్లు, లీన్ ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆ ఆహార ప దార్థాలు ఏమిటో చూద్దాం రండి..

కడుపు నొప్పిని నయం చేసే సూపర్ ఫుడ్స్..

  • అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి కడుపు నొప్పికి అద్భుతంగా పనిచేస్తాయి.
  • లైకోరైస్ కడుపు లైనింగ్ వాపును తగ్గిస్తుందని, పొట్టలో ఉండే రక్షిత శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది.
  • ఫ్లాక్స్ సీడ్ అనేది డైటరీ ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ను కలిగి ఉంది. ఇది మీ జీర్ణవ్యవస్థకు బాగా ఉపయోగపడతాయి.
  • అరటిపండ్లు ప్రీబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. పెక్టిన్ కంటెంట్ పేగులలోని అదనపు ద్రవాన్ని గ్రహిస్తుంది, మలాన్ని దృఢంగా చేస్తుంది. అతిసారం త్వరితగతిన తగ్గడానికి సాయపడుతుంది.
  • ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది ప్రేగులకు మంచి బ్యాక్టీరియాను అందిస్తాయి. గ్యాస్, ఉబ్బరం లేదా క్రమరహిత ప్రేగు కదలికల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  • బియ్యం, వోట్మీల్, క్రాకర్స్ టోస్ట్ వంటి బ్లాండ్ కార్బోహైడ్రేట్లు కడుపు నొప్పి ఉన్నవారికి సహాయపడవచ్చు. గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలతో వ్యవహరించేటప్పుడు సాదా వైట్ రైస్ ఒక గొప్ప ఎంపిక. ఇది జీర్ణం చేయడం సులభం. కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటుంది, ఇది శక్తిని అందిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..