ఈ డ్రింక్ గ్లాసుడు తాగారంటే.. శీతాకాలంలోనూ మీ చర్మం చందమామలా మెరవాల్సిందే!
శీతాకాలంలో చలి కారణంగా చర్మం పొడి బారి గరుకుగా మారుతుంది, ముఖ కాంతి మాయమవుతుంది. దీంతో చాలా మంది చలి కాలంలో ఖరీదైన క్రీములు, లోషన్లను ఆశ్రయిస్తుంటారు. చర్మానికి బాహ్య సంరక్షణతో పాటు లోపలి నుంచి కూడా పోషణ అవసరం. ఇందుకోసం, శీతాకాలంలో కొన్ని జ్యూస్‌లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మీ చర్మానికి..

శీతాకాలంలో చలి కారణంగా చర్మం పొడి బారి గరుకుగా మారుతుంది, ముఖ కాంతి మాయమవుతుంది. దీంతో చాలా మంది చలి కాలంలో ఖరీదైన క్రీములు, లోషన్లను ఆశ్రయిస్తుంటారు. చర్మానికి బాహ్య సంరక్షణతో పాటు లోపలి నుంచి కూడా పోషణ అవసరం. ఇందుకోసం, శీతాకాలంలో కొన్ని జ్యూస్‌లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మీ చర్మానికి పోషణ అందిస్తాయి. శీతాకాలంలో కూడా మీ ముఖం చంద్రుడిలా ప్రకాశించేలా చేస్తుంది.
చర్మ సంరక్షణకు మేలు చేసే జ్యూస్‌లు ఇవే
కీర దోస జ్యూస్
శీతాకాలంలో కీర దోస జ్యూస్ తాగడం వల్ల మీ చర్మానికి తేమ సులువుగా అందుతుంది. ముఖం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మీరు ప్రతిరోజూ లేదా వారానికి కనీసం 2 సార్లు కీర దోసకాయ రసం తాగాలి. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి. ఇది చర్మం పొడిబారకుండా నిరోధిస్తుంది. ఇది కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలను కూడా తొలగిస్తుంది.
టమోటా జ్యూస్
మీరు మెరిసే చర్మం పొందాలనుకుంటే, టమోటా జ్యూస్ తాగవచ్చు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, లైకోపీన్ బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. చర్మాన్ని అందంగా మార్చడమే కాకుండా మొటిమల సమస్యను కూడా తొలగిస్తుంది.
క్యారెట్ జ్యూస్
శీతాకాలంలో మీ చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే క్యారెట్ జ్యూస్ తాగండి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడానికి. ముఖంపై ఉన్న నల్లటి మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








