AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: ఆవ నూనెతో అరికాళ్ల మసాజ్‌.. లాభాలు తెలిస్తే పక్కాగా ఫాలో అవుతారు

ఆవనూనెలో ఉండే ఒమేగా-3, 6 వంటి సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ నూనెతో మసాజ్‌ చేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగువుతుంది. చర్మాన్ని సహజంగా మాయిశ్చరైజ్‌ చేయడంలో కూడా ఆవాల నూనె ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆవాల నూనెను అరికాళ్లకు అప్లై చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు...

Lifestyle: ఆవ నూనెతో అరికాళ్ల మసాజ్‌.. లాభాలు తెలిస్తే పక్కాగా ఫాలో అవుతారు
Mustard Oil Massage
Narender Vaitla
|

Updated on: Sep 23, 2024 | 12:55 PM

Share

ఆవనూనెతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆవనూనెను వంటకాల్లో కూడా ఉపయోగిస్తుంటారు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆవ నూనెలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో బహుళఅసంతృప్త, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మంచివని నిపుణులు చెబుతుంటారు.

ఆవనూనెలో ఉండే ఒమేగా-3, 6 వంటి సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ నూనెతో మసాజ్‌ చేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగువుతుంది. చర్మాన్ని సహజంగా మాయిశ్చరైజ్‌ చేయడంలో కూడా ఆవాల నూనె ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆవాల నూనెను అరికాళ్లకు అప్లై చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అరికాళ్లను ఆవనూనెతో మసాజ్‌ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆవనూనెతో అరికాళ్లలో మసాజ్‌ చేసుకోవడం వల్ల కండరాలకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంతో ఉపయోగపడుతుంది. ఎక్కువ సేపు నడిచే వారు, నిలబడి పనిచేసే వారు రాత్రుళ్లు పడుకునే ముందు ఆవాల నూనెతో మసాజ్‌ చేసకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది. శరీరం మొత్తం రిలాక్స్‌ అవుతుంది. నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. హాయిగా నిద్రపడుతుంది.

నెలసరి సమయంలో మహిళల్లో కనిపించే కడుపు తిమ్మిరి, నొప్పి వంటి సమస్యలకు ఆవాల నూనె బాగా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఆవాల నూనెను అరికాళ్లకు మసాజ్‌ చేసుకోవడం వల్ల పీరియడ్స్ క్రాంప్స్ నుంచి ఉపశమనం పొందొచ్చు. మానసి ఒత్తిడితో బాధపడేవారు, నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారికి కూడా ఆవ నూనె మసాజ్‌ మేలు చేస్తుంది. గోరువెచ్చని ఆవాల నూనెతో పాదాలను మసాజ్‌ చేయడం వల్ల ఒత్తిడి దూరమై మనసు ప్రశాంతంగా మారుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..