Lifestyle: రాగి పాత్రలో నీరు తాగితే ఇన్ని లాభాలున్నాయా.? నెల రోజుల్లోనే స్పష్టమైన మార్పు

ఇప్పుడైతే నీటిని ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో తాగుతున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం రాగి పాత్రల్లోన నీటిని తాగే వారు. నీటిలో రాగి నాణేలను వేసే అలవాటు కూడా ఇలా ప్రారంభమైందే. రాగి పాత్రల్లో నీటిని నిల్వచేసి తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపి కాలేయం, మూత్రపిండాలు మెరుగవుతాయి...

Lifestyle: రాగి పాత్రలో నీరు తాగితే ఇన్ని లాభాలున్నాయా.? నెల రోజుల్లోనే స్పష్టమైన మార్పు
Copper Bottle
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 14, 2024 | 5:46 PM

ఇప్పుడైతే నీటిని ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో తాగుతున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం రాగి పాత్రల్లోన నీటిని తాగే వారు. నీటిలో రాగి నాణేలను వేసే అలవాటు కూడా ఇలా ప్రారంభమైందే. రాగి పాత్రల్లో నీటిని నిల్వచేసి తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపి కాలేయం, మూత్రపిండాలు మెరుగవుతాయి. రాగి యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ శరీరానికి మేలు చేస్తాయి. ఒక నెలరోజుల పాటు రాగి పాత్రల్లో ఉన్న నీటిని తాగితే శరీరంలో మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* రాగి పాత్రలో రాత్రంతా నిల్వ చేసిన నీటిని ఉదయం తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు కడుపు, కాలేయం, కిడ్నీలను డిటాక్సిఫై చేసే అనేక గుణాలు రాగిలో ఉన్నాయని, తద్వారా కడుపులో అల్సర్ లేదా ఇన్ఫెక్షన్ల సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

* రాగికి బ్యాక్టీరియాను నాశనం చేసే ప్రభావవంతమైన సామర్థ్యం ఉంటుంది. ముఖ్యంగా అంటువ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాతో ఇది వ్యతిరేకంగా పోరాడుతుంది. రాగి పాత్రల్లో నీటిని క్రమంతప్పకుండా తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

* బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజూ రాగి పాత్రలో నిల్వచేసిన నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది జీర్ణ క్రియను మెరుగుపరడచంతో పాటు, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

* ఇక ఆయుర్వేదం ప్రకారం కనీసం 8 గంటలు రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రంగా నిల్వ ఉన్న నీటిని ఉదయాన్నే తాగితే మేలు జరుగుతుంది.

* రాగి పాత్రల్లో నీటిని తాగడం వల్ల థైరాక్సిన్ హార్మోన్లు సమతుల్యం అవుతాయి. ఇది థైరాయిడ్ ప్రమాదాన్ని కూడా తొలగిస్తుంది.శరీరంలో వచ్చే నొప్పులు, వాపు సమస్యలను దూరం చేసే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా రాగిలో ఉంటాయి. అంతేకాదు ఈ నీటిని తీసుకుంటే యూరిక్‌ యాసిడ్‌ కూడా తగ్గుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..