AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందార జుట్టుకు మాత్రమే కాదు.. అందం, ఆరోగ్యానికి మంచి మెడిసిన్‌..! ఇలా వాడితే..

మందార మీ జుట్టు పొడుగ్గా పెరిగేలా, తెల్లవెంట్రుకలు రాకుండా నివారించడంలో మందార బెస్ట్‌ మెడిసిన్‌ అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అయితే, మందార పువ్వు జుట్టుకు మాత్రమే కాదు.. మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని మీకు తెలుసా. మందార పువ్వు అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం...

మందార జుట్టుకు మాత్రమే కాదు.. అందం, ఆరోగ్యానికి మంచి మెడిసిన్‌..! ఇలా వాడితే..
Hibiscus Flowers
Jyothi Gadda
|

Updated on: Feb 10, 2025 | 11:43 AM

Share

హెయిర్ ఫాల్ సమస్యకు మందార పువ్వు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. అవును మందార పువ్వును ఉపయోగించి వెంట్రుకలు ఊడిపోకుండా చేయొచ్చు. అలాగే మీ జుట్టు పొడుగ్గా పెరిగేలా, తెల్లవెంట్రుకలు రాకుండా నివారించడంలో మందార బెస్ట్‌ మెడిసిన్‌ అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అయితే, మందార పువ్వు జుట్టుకు మాత్రమే కాదు.. మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని మీకు తెలుసా. మందార పువ్వు అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…

మందార పువ్వులలో ఇనుము పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలోని రక్తహీనతను దూరం చేస్తుంది. మందార మొగ్గలను రుబ్బి దాని రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనితో పాటు, మందార పువ్వులు తినడం వల్ల కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అలాగే, మందార ఆకుల టీ తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.

మందార పువ్వులో పెద్ద మొత్తంలో యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వయసు పైబడినా సంకేతాలు కనిపించకుండా చేసి మీ అందాన్ని చెక్కుచెదరకుండా ఉంచుతుంది. మందారం వాడకంతో మనం ఫ్రీ రాడికల్స్ నుండి కూడా ఉపశమనం పొందుతాము. హైబిస్కస్ టీ తాగడం వల్ల అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

విటమిన్ సి అధికంగా ఉండే మందార ఆకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. తరచుగా జలుబు, దగ్గు సమస్యతో బాధపడుతున్నవారికి మందారం టీతో ఉపశమనం లభిస్తుంది. మందారం పూలతో గొంతు నొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. మందార ఆకులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

మందార పువ్వు ఆకులు జుట్టును మందంగా, మృదువుగా, మెరిసేలా చేస్తాయి. దీని ఆకులతో తయారు చేసిన హెయిర్ ఆయిల్ జుట్టును పొడవుగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట