AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

40ఏళ్లు పైబడిన ఆడవాళ్లు అడపాదడపా ఉపవాసం చేస్తే మంచిదేనా..? శరీరంలో కలిగే మార్పులు తెలిస్తే..

అలాగే, అతిగా తినడం మానుకోండి. సూచించిన పరిమాణంలో మాత్రమే ఆహారం తీసుకోవాలి. భోజన సమయం కాగానే, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన సమతుల్య ఆహారం తీసుకోండి. దీనివల్ల ఆకలి కూడా అదుపులో ఉంటుంది. అడపాదడపా ఉపవాసం చేస్తూ మీ శరీరానికి ఆహారం నుండి విరామం ఇవ్వడం వల్ల చర్మాన్ని అందంగా మార్చకోవచ్చు .

40ఏళ్లు పైబడిన ఆడవాళ్లు అడపాదడపా ఉపవాసం చేస్తే మంచిదేనా..? శరీరంలో కలిగే మార్పులు తెలిస్తే..
Fasting
Jyothi Gadda
|

Updated on: Feb 10, 2025 | 11:42 AM

Share

నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది తిండి, నిద్రపై సరైన శ్రద్ధ చూపటం లేదు.. దీంతో అధిక బరువు, ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బరువు పెరగడం చాలా మంది మహిళలకు ప్రధాన సమస్యగా మారింది. మరీ ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళలకు ఇది చాలా కష్టంగా మారింది. అవును, వయసు పెరిగే కొద్దీ బరువు తగ్గడం కష్టమవుతుంది.. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ జీవక్రియ మందగించడం మొదలవుతుంది. ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత, మహిళలు బరువు పెరగడం మొదలవుతుంది. అప్పుడు ఎంత ట్రై చేసిన ఆపలేరు. అయితే, ఈ రోజుల్లో, బరువు తగ్గడానికి అనేక రకాల డైటింగ్‌లు వాడుకలో ఉన్నాయి. వాటిలో ఒకటి ఉపవాసం. అయితే, ఈ ఉపవాసం ఎలా చేయాలి.. ఏం తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

అవును.. ఉపవాసం ఉండటం వల్ల ఆహారం తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది క్రమంగా బరువు తగ్గాడనికి దోహదం చేస్తుంది. 40 ఏళ్లు పైబడిన వారిలో ఇన్సులిన్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను చేర్చుకోండి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. సెరామైడ్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంటే.. పాలకూర, బంగాళాదుంపలు, కొబ్బరి , గుడ్లు సిరామైడ్‌లతో నిండి ఉంటాయి. చర్మాన్ని దృఢంగా , హైడ్రేటెడ్‌గా ఉంచే ముఖ్యమైన హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. ఇక.. డైట్ లో కచ్చితంగా నట్స్, ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి.

డీహైడ్రేషన్.. తలనొప్పి, ఆకలి తగ్గడానికి కారణమవుతుంది. ఉపవాస సమయంలో మీరు వీలైనంత ఎక్కువ నీరు, హెర్బల్ టీ లేదా ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే, చక్కెర లేని పానీయాలు కూడా తాగవచ్చు. అలాగే, 40 ఏళ్లు పైబడిన స్త్రీలు పెరిమెనోపాజ్ లేదా మెనోపాజ్‌ను అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలి హార్మోన్లైన గ్రెలిన్, లెప్టిన్, ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే అడపాదడపా ఉపవాసం చేయండి.

ఇవి కూడా చదవండి

మీరు జిమ్‌, లేదంటే ఎక్కువ వ్యాయామాలు చేస్తున్నట్టయితే, మీ ఉపవాసాలను తగ్గించుకోవాలి. వ్యాయామం తర్వాత భోజనం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇది మీ కండరాల పునరుద్ధరణను ప్రభావితం చేయదు. 40 ఏళ్లు పైబడిన మహిళలు చేసే అడపాదడపా ఉపవాసం ప్రభావం వారి నిద్రపై కూడా ఆధారపడి ఉంటుంది. మీరు తగినంత నిద్రపోకపోతే, అది మీ ఆకలి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. దీంతో మీరు చేసే ఉపవాసం కష్టంగా మారుతుంది.

అలాగే, అతిగా తినడం మానుకోండి. సూచించిన పరిమాణంలో మాత్రమే ఆహారం తీసుకోవాలి. భోజన సమయం కాగానే, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన సమతుల్య ఆహారం తీసుకోండి. దీనివల్ల ఆకలి కూడా అదుపులో ఉంటుంది. అడపాదడపా ఉపవాసం చేస్తూ మీ శరీరానికి ఆహారం నుండి విరామం ఇవ్వడం వల్ల చర్మాన్ని అందంగా మార్చకోవచ్చు .

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..