Ginger Benefits: వావ్ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో రెట్టింపు బెనిఫిట్స్..!
అల్లం కేవలం వంటకు రుచిని ఇవ్వడమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు జలుబు, నొప్పులను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ నియంత్రణకు, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి అల్లం తోడ్పడుతుంది. మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యం సొంతం.

అల్లం వంటలకు కేవలం మంచి రుచిని ఇవ్వడమే కాదు.. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అల్లంలో ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు అల్లంతో చెక్ పెట్టొచ్చు. జలుబు, దగ్గు, తలనొప్పి, మైగ్రేన్, నడుంనొప్పి, వెన్నుపూస నొప్పి, మోకాలి నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలను తగ్గించడానికి అల్లం మంచి మెడిసిన్. ఆకలిని పెంచడంలో అల్లం బాగా సహాయ పడుతుంది. ముఖ్యంగా కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాన్సర్ బాధితులకు ఆకలి తగ్గిపోతుంది.
అల్లం రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేసి, జుట్టును బలంగా, ఒత్తుగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఈ సహజ ఔషధాన్ని మీ రోజువారీ జీవనశైలిలో చేర్చుకోవడం మంచిది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కొన్నిసార్లు ఆకలిగా అనిపించదు. ఇందులో నొప్పి, వాపును తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రోజుకు 2 నుంచి 5 గ్రాముల అల్లంను రెండు వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అల్లం జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సహాయపడుతుందే కాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం తినడం లేదా అల్లం నీరు తాగడం శరీర డిటాక్స్‌కు సహాయపడుతుంది. ఒక నెలపాటు ప్రతిరోజూ అల్లం తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అల్లంలోని పదార్థాల వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్‌ల పరిమాణం తగ్గుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




