Hair Care Tips: సాధారణంగా అందరూ వారానికి 2 నుంచి 3 సార్లు తలస్నానం చేస్తారు. అయితే కొంతమంది రాత్రి పడుకునే ముందు తలస్నానం చేస్తుంటారు. రోజంతా ఆఫీస్‌లో గడపడం, అలసట, ఇంకా పలు శారీరక సమస్యల నుంచి రిలీఫ్ పొందేందుకు ఇలా రాత్రిపూట తలస్నానం చేస్తుంటారు. కానీ అయితే ఆడపిల్లలు రాత్రిపూట స్నానం చేయడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. పలు గ్రంథాలలో కూడా ఈ విషయంపై పలు ఆసక్తికర విషయాలు పొందుపరిచారు. మరి ఆడవారు రాత్రిపూట ఎందుకు తలస్నానం చేయకూడదు? ఈ విషయంపై సైన్స్, శాస్త్రాలు ఏం చెబుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం రండి.
సైన్స్ ఏం చెబుతుందంటే?
ఆడవాళ్లలో చాలామంది రాత్రిపూట తలస్నానం చేసిన తర్వాత తమ శిరోజాలను ఆరబెట్టుకోరు. అలాగే నిద్రకు ఉపక్రమిస్తారు. దీనివల్ల పలు జట్టు సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జట్టు కుదుళ్లు బలహీనపడతాయి. అలాగే తడిజుట్టుతో పడుకోవడం వల్ల వెంట్రుకల చివర్లు చిట్లిపోతాయి. ఇక జుట్టులో తేమ కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయని ఫలితంగా జలుబుతో పాటు అలెర్జీ, డాండ్రఫ్, హెయిర్‌పాల్ తదితర సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
శాస్త్రం ఏమంటుందంటే?
ఇక శాస్త్రాల ప్రకారం ఆడవారు రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అలాగే ఆర్థిక సమస్యలు మొదలవుతాయట. అలాగే కుటుంబంలో పలు సమస్యలను ఎదుర్కొంటారట. ఇంటికి ఐశ్వర్యం రాదట. ఆడవాళ్లను గృహ లక్ష్మిగా భావిస్తారని, అలాంటిది వారు రాత్రిపూట తలస్నానం చేయడం ఇంటికి మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే మెదడుపై ప్రతికూల ప్రభావం పడడంతో పాటు గ్రహాల రాశుల దిశలు కూడా మారుతాయట.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండం ఉత్తమం.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..