AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిపూట లైట్ ఆన్ చేసి పడుకుంటున్నారా.. మీ గుండె ఆగిపోవచ్చు.. జాగ్రత్త..

రాత్రిపూట లైట్ వేసుకుని పడుకుంటున్నారా..? అయితే మీ గుండె ప్రమాదంలో పడినట్లే. అవును లైట్ వేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరం అని కొత్త పరిశోధన తేల్చింది. ఇది మెదడు ఒత్తిడి, ధమనులలో వాపుకు దారితీసి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందట. దీన్ని గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రాత్రిపూట లైట్ ఆన్ చేసి పడుకుంటున్నారా.. మీ గుండె ఆగిపోవచ్చు.. జాగ్రత్త..
Artificial Light Health Risk
Krishna S
|

Updated on: Nov 18, 2025 | 8:23 PM

Share

హార్వర్డ్ విశ్వవిద్యాలయం కొత్త పరిశోధన ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. రాత్రిపూట మనం ఉపయోగించే కొద్దిపాటి కృత్రిమ కాంతి కూడా మన గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. గతంలో అనుకున్న దానికంటే ఈ కాంతి కాలుష్యంతో ఎక్కువ నష్టం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం వంటి పర్యావరణ కారకాలు గుండె జబ్బులకు కారణమవుతాయని మనకు తెలుసు. కానీ కాంతి కాలుష్యంపై గతంలో పెద్దగా ఎవరూ పరిశోధనలు చేయలేదు. కృత్రిమ కాంతి గుండె వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి పరిశోధకులు అధునాతన మెదడు ఇమేజింగ్ పద్ధతులను ఉపయోగించారు.

మెదడు ఒత్తిడి.. వాపు

డాక్టర్ అబోహాషెమ్ బృందం 466 మంది ఆరోగ్యకరమైన వ్యక్తులపై పదేళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించింది. రాత్రిపూట కాంతికి ఎక్కువగా గురైన వారిలో పరిశోధకులు కొన్ని కీలక మార్పులను గమనించారు..

మెదడు ఒత్తిడి : రాత్రిపూట కృత్రిమ కాంతికి గురికావడం వల్ల మెదడులో ఒత్తిడి కార్యకలాపాలు పెరిగాయి.

ధమనులలో వాపు : మెదడు ఒత్తిడి, రక్త నాళాలలో వాపుకు కారణమయ్యే రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందని అధ్యయనం వివరిస్తుంది. కాలక్రమేణా ఈ ప్రక్రియ ధమనులు గట్టిపడటానికి దారితీసి.. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ప్రమాదం ఎంత..?

ఈ అధ్యయనం వెల్లడించిన అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. రాత్రిపూట కాంతికి గురయ్యే స్థాయి పెరిగే కొద్దీ, ఐదు సంవత్సరాలలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఏకంగా 35శాతం పెరుగుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. శబ్ద కాలుష్యం, జీవనశైలి వంటి ఇతర కారణాలను లెక్కలోకి తీసుకున్న తర్వాత కూడా ఈ ప్రమాదం అలాగే ఉంది. డాక్టర్ అబోహాషెమ్ ప్రకారం.. రాత్రిపూట కాంతిలో స్వల్ప పెరుగుదల కూడా మెదడు, ధమనులలో ఒత్తిడి ప్రతిస్పందనలతో ముడిపడి ఉంటుందని, అధిక స్థాయిలో కాంతికి గురికావడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఆదాయం లేదా అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో నివసించే వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

నిద్రపైనా ప్రభావం

రాత్రిపూట కృత్రిమ కాంతి వల్ల కలిగే నష్టాలు కేవలం గుండె ఆరోగ్యానికే పరిమితం కాలేదు.

నిద్ర చక్రం: ఇది మన శరీరం యొక్క నిద్ర-మేల్కొనే చక్రాన్ని పాడు చేస్తుంది. దీనివల్ల సరిగా నిద్ర పట్టకపోవడం, నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి.

అల్జీమర్స్: రాత్రిపూట ప్రకాశవంతమైన లైట్లకు గురికావడం వల్ల వృద్ధులలో అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని మునుపటి అధ్యయనాలు తెలిపాయి.

కాంతి కాలుష్యాన్ని తగ్గించుకోవడం ఎలా?

కాంతి కాలుష్యం తగ్గించుకోవడానికి సులువైన మార్గాలు

గది చీకటిగా: పడుకునే గదిని వీలైనంత చీకటిగా ఉంచుకోండి.

స్క్రీన్లు వద్దు: నిద్రకు ముందు ఫోన్లు, టీవీలు చూడటం మానుకోండి.

బ్లాక్అవుట్ కర్టెన్లు: బయటి వీధి దీపాల కాంతి లోపలికి రాకుండా మందపాటి కర్టెన్లు లేదా స్లీప్ మాస్క్ వాడండి.

డాక్టర్ అబోహాషెమ్ చెప్పినట్లు.. కాంతి కాలుష్యం అనేది కేవలం ఇబ్బంది కాదు.. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని చురుకుగా పెంచుతోంది. కాబట్టి దీన్ని నివారించడం చాలా ముఖ్యం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

ఇక్కడ ఆడాల్సిందే.. లేదంటే ఇంటికే బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్
ఇక్కడ ఆడాల్సిందే.. లేదంటే ఇంటికే బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్
హీరో తరుణ్ పెళ్లి పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన ఒకప్పటి హీరోయిన్..
హీరో తరుణ్ పెళ్లి పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన ఒకప్పటి హీరోయిన్..
సంక్రాంతికి సెలవులకు ఊరెళ్తున్నారా? మీకో హెచ్చరిక..! మర్చిపోవద్దు
సంక్రాంతికి సెలవులకు ఊరెళ్తున్నారా? మీకో హెచ్చరిక..! మర్చిపోవద్దు
చిరును వాడడం అంటే ఇది! అనిల్ మళ్లీ నెగ్గాడ్రోయ్‌..! రివ్యూ...!
చిరును వాడడం అంటే ఇది! అనిల్ మళ్లీ నెగ్గాడ్రోయ్‌..! రివ్యూ...!
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. వారందరికీ రూ.2 లక్షల చొప్పున సాయం
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. వారందరికీ రూ.2 లక్షల చొప్పున సాయం
ఏం అదృష్టంరా స్వామి.. ఫిబ్రవరిలో రాజయోగం పట్టనున్న రాశులివే!
ఏం అదృష్టంరా స్వామి.. ఫిబ్రవరిలో రాజయోగం పట్టనున్న రాశులివే!
చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేయాలి?
చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేయాలి?
ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సచివాలయం వేదికగా కీలక..
ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సచివాలయం వేదికగా కీలక..
ఈ రాశుల వారికి మౌనీ అమావాస్యతో ఆ గండం తప్పినట్లే.. ఇక నుంచి లక్కు
ఈ రాశుల వారికి మౌనీ అమావాస్యతో ఆ గండం తప్పినట్లే.. ఇక నుంచి లక్కు
మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?
మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?