Hair Fall Oil: జుట్టు రాలడాన్ని 7 రోజుల్లో నివారించే హెయిర్ ఆయిల్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంత మందికి అపురూపంగా చూసుకునే జుట్టు రాలిపోతుంటుంది. తల దువ్విన ప్రతిసారి దువ్వెన నిండా జుట్టు కుప్పలు తెప్పలుగా రాలిపోతుంటుంది. జుట్టు రాలడం ఎలా అదుపు చేయాలో తెలియక మగువలు మానసికంగా కుంగిపోతుంటారు. నిజానికి వెంట్రుకలు రాలిపోవడం వెనుక అనేక కారణాలు ఉంటాయంటున్నారు సౌందర్య నిపుణులు. వాతావరణం కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణం..

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంత మందికి అపురూపంగా చూసుకునే జుట్టు అకారణంగా రాలిపోతుంటుంది. తల దువ్విన ప్రతిసారి దువ్వెన నిండా జుట్టు కుప్పలు తెప్పలుగా రాలిపోతుంటుంది. జుట్టు రాలడం ఎలా అదుపు చేయాలో తెలియక మగువలు మానసికంగా కుంగిపోతుంటారు. నిజానికి వెంట్రుకలు రాలిపోవడం వెనుక అనేక కారణాలు ఉంటాయంటున్నారు సౌందర్య నిపుణులు. వాతావరణం కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణం. వేడి, వర్షం, చెమట, కాలుష్యం వల్ల తల వెంట్రులకు తీరని నష్టం వాటిల్లుతుంది. వర్షాకాలంలో మురికి నీళ్లు తలపై పడటం వల్ల ఫంగస్ ఏర్పడుతుంది. దీని వల్ల జుట్టుకు తీరని నష్టం వాటిల్లుతుంది.
రోజూ షాంపూ చేసినా తల వెంట్రుకలు రాలిపోతాయి. వీటిల్లోని రసాయనాలు జుట్టుపై ప్రతికూల ప్రభావాన్ని చూపి జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది. థైరాయిడ్, హార్మోన్ల సమస్యలు జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు. అమినో యాసిడ్స్, విటమిన్ ఇ లోపిస్తే కూడా ఈ సమస్య రావచ్చు. కురుల సంరక్షణకు మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్ కంటే ఇంట్లో తయారు చేసుకునే ఆయిల్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీని వల్ల జుట్టు రాలిపోకుండా ఉండటమే కాకుండా తలలోని చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలంటే.. ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకుని వేడి చేసుకోవాలి. అందులో సగం గిన్నె కరివేపాకు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేయాలి. బాగా వేడి చేసిన తర్వాత వడకట్టి ఎండలో గంటసేపు ఉంచాలి. ఈ నూనెను వారానికి రెండుసార్లు తలకు పట్టించాలి. ముఖ్యంగా ఈ నూనెను కుదుళ్లకు బాగా పట్టించాలి.
నూనె మాదిరిగానే ఇంట్లోనే సహజసిద్ధమైన షాంపూ కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకు పొడి మార్కెట్‌లో దొరుకుతుంది. ఒక గిన్నెలో 2 స్పూన్ల రోజువారీ షాంపూ తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ కరివేపాకు పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని అర గిన్నె నీటిలో వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా నీళ్లతో జుట్టును తడిపి ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి బాగా రుద్దాలి. 2 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇది జుట్టును మృదువుగా, కోమలంగా చేస్తుంది. లేదా కలబంద గుజ్జులో తేనె కలిపి మిక్స్ చేసి జుట్టు కుదుళ్లకు అప్లై చేసి 5 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.