మీ జుట్టు రాలుతుందా? ఈ కలబంద హెయిర్ మాస్క్ ట్రై చేయండి
నేటి కాలంలో జుట్టు సమస్యలు విపరీతంగా వస్తున్నాయి. ముఖ్యంగా వెంట్రుకలు రాలడం, చుండ్రు వంటి సమస్యలకు పరిష్కారం కరువైంది. అయితే వీటికి కలబంద జెల్ ఉపయోగించి చికిత్స చేయవచ్చని నిపుణులు అంటున్నారు. జుట్టు రాలడం, చుండ్రు వంటి అనేక సమస్యలను కూడా ఇది తరమికొట్టగలదట..

ఎంత జాగ్రత్తగా ఉన్నా నేటి కాలంలో జుట్టు సమస్యలు విపరీతంగా వస్తున్నాయి. ముఖ్యంగా వెంట్రుకలు రాలడం, చుండ్రు వంటి సమస్యలకు పరిష్కారం కరువైంది. అయితే వీటికి కలబంద జెల్ ఉపయోగించి చికిత్స చేయవచ్చని నిపుణులు అంటున్నారు. జుట్టు రాలడం, చుండ్రు వంటి అనేక సమస్యలను కూడా ఇది తరమికొట్టగలదట. కలబంద హెయిర్ మాస్క్‌ను వివిధ మార్గాల్లో ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఆముదం నూనె, మెంతి పొడి, కలబంద హెయిర్ మాస్క్
జుట్టు రాలడానికి, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు ఉంటే.. ఒక కప్పు కలబంద జెల్, 2 టీస్పూన్ల ఆముదం నూనె, 2 టీస్పూన్ల మెంతి పొడి కలిపి జుట్టుకు అప్లై చేసి 2 గంటలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తల స్నానం చేయాలి.
తేనె, కొబ్బరి నూనె, కలబంద హెయిర్ మాస్క్
చుండ్రు, నిర్జీవ జుట్టు కోసం.. 5 టేబుల్ స్పూన్ల కలబంద జెల్, 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల తేనె తీసుకుని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీన్ని మీ జుట్టుకు అప్లై చేసి, అరగంట తర్వాత తల స్నానం చేయాలి.
నిమ్మ- కలబంద హెయిర్ మాస్క్
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి.. 1 టీస్పూన్ నిమ్మరసంలో 2 టీస్పూన్ల కలబంద జెల్ కలిపి జుట్టుకు పట్టించాలి. నిమ్మకాయలోని విటమిన్ సి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
ఉల్లిపాయ రసం, కలబంద హెయిర్ మాస్క్
1 కప్పు ఉల్లిపాయ రసం, ఒక టీస్పూన్ కలబంద జెల్ కలిపి మీ జుట్టుకు అప్లై చేయాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కొత్త జుట్టు కూడా పెరుగుతుంది.
జస్వంద్- కలబంద హెయిర్ మాస్క్
జుట్టు బలానికి, పోషణకు.. 2 టీస్పూన్ల జస్వంద్ పేస్ట్, 1 కప్పు కలబంద జెల్ కలిపి తలకు, జుట్టుకు అప్లై చేయాలి. 30 నుండి 60 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూ, కండిషనర్‌తో తల స్నానం చేయాలి.
నిమ్మరసం, విటమిన్ ఇ, కలబంద హెయిర్ మాస్క్
జుట్టు రాలడాన్ని నివారించడానికి, 1 టీస్పూన్ కలబంద జెల్, 1 టీస్పూన్ నిమ్మరసం మరియు 1 టీస్పూన్ విటమిన్ ఇ నూనె కలిపి రాసుకోండి. ఈ ప్యాక్ జుట్టును బలంగా మరియు ఆరోగ్యంగా చేస్తుంది.
గ్రీన్ టీ, కలబంద హెయిర్ మాస్క్
జుట్టు పెరుగుదలకు 1 కప్పు గ్రీన్ టీ, 1 కప్పు కలబంద జెల్ కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఈ ప్యాక్ జుట్టు పెరుగుదలను పెంచుతుంది. మీ జుట్టుకు పోషణను అందిస్తుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




