AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Juice for Hair: మీ తలపై వెంట్రుకలు విపరీతంగా ఊడిపోతున్నాయా? ఉల్లి పాయతో ఇలా చెక్ పెట్టండి..

నేటి జీవనశైలి కారణంగా ఎవరికీ చూసినా జుట్టు సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో బారెడు ఉండాల్సిన పొడవైన జుట్టు మూరెడు అయిపోతుంది. జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరిగేందుకు ఉల్లి బలేగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల జుట్టు రాలడాన్ని నివారించడానికి ఉల్లిపాయను ఎలా వినియోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

Onion Juice for Hair: మీ తలపై వెంట్రుకలు విపరీతంగా ఊడిపోతున్నాయా? ఉల్లి పాయతో ఇలా చెక్ పెట్టండి..
Onion Juice For Hair
Srilakshmi C
|

Updated on: Apr 06, 2025 | 8:02 PM

Share

మగువలు పొడవాటి, దట్టమైన జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో జుట్టు రాలడం, తెల్ల జుట్టు, చుండ్రు వంటి వివిధ సమస్యల కారణంగా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక సవాలుగా మారింది. ఏం చేసినా జుట్టు రాలడం ఆగట్లేదని బాధపడేవారికి నిపుణులు గొప్ప చిట్కా చెబుతున్నారు. అందువల్ల జుట్టు రాలడాన్ని నివారించడానికి ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించడం ఎంతో ప్రయోజనకంగా ఉంటుందని సూచిస్తున్నారు. దీనిని ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం..

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ఉల్లిపాయ రసం భేష్‌..

జుట్టు రాలడాన్ని నివారించడానికి హెయిర్‌ నూనె లేదా ఇతర ఉత్పత్తులకు బదులుగా వంటలో కీలకమైన ఉల్లిపాయను ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఉల్లిపాయ రసాన్ని తీసి జుట్టుకు బాగా మసాజ్ చేసుకోవాలి. ఉత్తమ ఫలితాల కోసం వారానికి రెండుసార్లు మసాజ్ చేసుకోవడం మంచిది. అంతేకాకుండా, వ్యర్థంగా పారవేసే ఉల్లిపాయ తొక్కలు కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దీనిని జుట్టుకు అప్లై చేస్తే, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

జుట్టు సంరక్షణ కోసం ఉల్లిపాయ రసాన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే..

తాజా ఉల్లిపాయలను మిక్సిలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిని పల్చటి గుడ్డ తీసుకుని వడకట్టాలి. ఉల్లి రసం వాసన ఘాటుగా ఉండాలి. దీనిని జుట్టుకు అప్లై చేస్తే 99 శాతం జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.