AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interesting Facts: గ్రీన్ టీ vs బ్లాక్ కాఫీలో ఏది హెల్త్‌కి మంచిది?

చాలా మందికి గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉంది. సాధారణ టీ కంటే వీటిని తాగడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నార్మల్ టీ కంటే గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగడం వల్ల చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. సాధారణ టీ తాగడం వల్ల కాస్త ఉపశమనం లభించినా.. గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీకి ఉండే గుణాలు వేరు. అంతే కాకుండా.. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గొచ్చు. ఈ రెండూ ఆరోగ్యానికి చాలా మంచివే..

Interesting Facts: గ్రీన్ టీ vs బ్లాక్ కాఫీలో ఏది హెల్త్‌కి మంచిది?
Green Tea Vs Black Coffee
Chinni Enni
|

Updated on: Feb 23, 2024 | 5:05 PM

Share

చాలా మందికి గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉంది. సాధారణ టీ కంటే వీటిని తాగడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నార్మల్ టీ కంటే గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగడం వల్ల చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. సాధారణ టీ తాగడం వల్ల కాస్త ఉపశమనం లభించినా.. గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీకి ఉండే గుణాలు వేరు. అంతే కాకుండా.. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గొచ్చు. ఈ రెండూ ఆరోగ్యానికి చాలా మంచివే అయినా.. వీటిల్లో కొద్ది కొద్ది మార్పులు ఉన్నాయి. అయితే కొంత మంది గ్రీన్ టీ మంచిదంటే.. మరికొంత మంది బ్లాక్ కాఫీ మంచిదని అంటారు. మరి వీటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిదో.. వీటి గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ టీ:

గ్రీన్ టీని చాలా మంది ఇష్ట పడి తాగుతూ ఉంటారు. గ్రీని టీని.. కామెల్లియా సైనెన్సిస్ మొక్క ఆకుల నుంచి తయారు చేస్తారు. ఇందులో క్యాటెచిన్ మెండుగా ఉంటుంది. ఇది తాగితే గుండె పని తీరు మెరుగు పడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గడం కోసం చాలా మంది తాగుతూ ఉంటారు. అంతే కాకుండా బ్రెయిన్ కూడా యాక్టీవ్‌గా పని చేస్తుంది. ఇది తరచూ తాగితే మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది.

బ్లాక్ కాఫీ:

ఈ కాఫీని.. బ్లాక్ కాఫీ అని కూడా పిలుస్తారు. ఇది కాల్చిన కాఫీ గింజల నుంచి తయారు చేస్తారు. ఇందులో కెఫిన్ ఉంటుంది. కేవలం చక్కెర కలపకుండా తాగుతారు. ఈ కాఫీ చాలా చేదుగా ఉంటుంది. కేవలం కొద్ది మంది మాత్రమే తాగుతారు. ఇది తాగడం వల్ల అలసట అనేది దూరం అవుతుంది. మానసిక స్థితి కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ కాఫీని తరచూ తాగితే కాలేయ పరిస్థితి, నాడీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా బరువు కూడా కంట్రోల్ అవుతుంది. జీవక్రియను కూడా మెరుగు పరుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ రెండింటిలో ఏది బెస్ట్..

ఈ రెండింటిపై చేసిన అధ్యయనంలో.. బ్లాక్ కాఫీ కంటే గ్రీన్ మెరుగైనదని నిపుణులు తేల్చారు. ఇవి రెండూ యాంటీ ఆక్సిడెంట్ల సామర్థ్యాన్ని పెంచాయి. కానీ బ్లాక్ కాఫీ కంటే గ్రీన్ టీ కాస్త ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్య తేడా ఏంటంటే.. కెఫీన్. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి బ్లాక్ కాఫీని మితంగా తీసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

Follow Us