Lifestyle: చిన్నారులకు తేనె ఇవ్వడం మంచిది కాదా.? నిపుణులు ఏమంటున్నారు

అప్పుడే పుట్టిన చిన్నారులకు పెద్దలు తేనెను తినిపిస్తుండడం గమనించే ఉంటాం. అయితే ఇది శిశువులకు అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది చిన్నారుల్లో అనారోగ్యానికి కారణమవుతుండొచ్చని చెబుతుంటారు. తేనెలోని క్లోస్ట్రిడియం బోటులినమ్‌ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా బోటులిజం అనే తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుంది...

Lifestyle: చిన్నారులకు తేనె ఇవ్వడం మంచిది కాదా.? నిపుణులు ఏమంటున్నారు
Honey For Kids
Follow us

|

Updated on: Mar 29, 2024 | 10:26 AM

తేనె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తేనెలోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే అప్పుడే పుట్టిన శిశువులకు కూడా తేనెను ఇస్తుంటారు. ఇంతకీ నవజాత శిశువులకు తేనె ఇవ్వడం మంచిదా.? కాదా.? అసలు నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

అప్పుడే పుట్టిన చిన్నారులకు పెద్దలు తేనెను తినిపిస్తుండడం గమనించే ఉంటాం. అయితే ఇది శిశువులకు అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది చిన్నారుల్లో అనారోగ్యానికి కారణమవుతుండొచ్చని చెబుతుంటారు. తేనెలోని క్లోస్ట్రిడియం బోటులినమ్‌ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా బోటులిజం అనే తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుంది. ఏడాదిలోపు పిల్లల్లో ఈ బ్యాక్టీరియాను తట్టుకునే మంచి బ్యాక్టీరియా పేగుల్లో ఉండదు. ఈ కారణంగానే చిన్నారుల్లో అనారోగ్యం కలుగుతుంది.

ఒకవేళ చిన్నారులు బోటులిజం వ్యాధి బారిన పడితే మలబద్ధకం, కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు అకారణంగా ఏడవం, పాలు తాగడంలో ఇబ్బంది, ముఖ కవళికల్లో ఎలాంటి మార్పు లేకపోవడం వంటివన్నీ బోటులిజం లక్షణాలే. అందుకే చిన్నారులకు తేనె ఇవ్వకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే రెండేళ్ల తర్వాత నుంచి పిల్లలకు ఎలాంటి అనుమానం లేకుండా తేనెను ఇవ్వొచ్చు. తేనెలోని ఎన్నో ఔషధ గుణాలు మేలు చేస్తాయి. అయితే చిన్నారులకు మాత్రమే తేనెను ఇవ్వకపోవడమే మంచిదని చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..