Viral News: 20ల్లో పెళ్లి చేసుకుంటే ఇన్ని ప్రయోజనాలా.. నెట్టింట వైరలవుతున్న జంట
బాధ్యతల భారం మోయాల్సి వస్తుందనో.. లేక నచ్చిన వ్యక్తి దొరక్కనో చాలా మంది పెళ్లిళ్లను పోస్ట్ పోన్ చేస్తుంటారు. అయితే, ఈ జంట మాత్రం ఇరవై ఏళ్లకే పెళ్లి చేసుకుని 40 ఏళ్లలో సెటిలైపోయి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తన లైఫ్ జర్నీని నెట్టింట షేర్ చేయడంతో మిలియన్ల వ్యూస్ తో ఈ వీడియో దూసుకుపోతోంది. చాలా మంది ఈ జంటను చూసి స్ఫూర్తి పొందుతున్నారు.

సమాజంలో వయస్సు ఆధారంగా వ్యక్తులను జడ్జ్ చేసే రోజులివి. కొన్ని కథలు ఇలాంటి స్టీరియోటైప్ విషయాలను బద్దలు కొట్టి కొత్త కోణాన్ని చూపుతుంటాయి. అలాంటి ఓ జంటే ఇప్పుడు ఇంటర్నెట్ లో హృదయాలను గెలుచుకుంటోంది. రజనీ సింగ్ ఆమె భర్త డేల్ ఆస్టన్ జంట అద్భుతమైన ట్రాన్స్ ఫర్మేషన్ స్టోరీ అలాంటిదే. 20 ఏళ్లలో వివాహం, 30 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలు, 40 ఏళ్లలో కుర్రకారుకు ఏమాత్రం తీసిపోని విధాంగా మెరుస్తున్నారీ జంట. ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని స్ఫూర్తినిస్తున్నారు. వారి లైఫ్ జర్నీ, ఫిట్‌నెస్, జీవితంపై పాజిటివ్ దృక్పథం వంటివి నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.
20లో వివాహం
రజనీ సింగ్ అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో @rajni_singh.official ఖాతా ద్వారా పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. రజనీ తన 20 ఏళ్ల వయసులోనే భర్త డేల్ ఆస్టెన్ ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడీ జంట తమ నలభైల్లో ఉంది. ఆనాటి నుంచి 40 ఏళ్ల వయస్సు వరకు తన జీవిత ప్రయాణాన్ని చూపుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో తమ జీవితంలోని వివిధ దశలను ఫోటో కాలేజ్ రూపంలో అద్భుతంగా ప్రదర్శించింది.
30 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలు
30 ఏళ్లు రాకముందే, రజనీ మరియు డేల్ ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. కుటుంబ జీవిత బాధ్యతలను సమతుల్యం చేస్తూ, వారు తమ ప్రేమ బంధాన్ని బలంగా కొనసాగించారు. చిన్న చిన్న కారణాలకే విడిపోతున్న ఈ రోజుల్లో వీరిద్దరి లైఫ్ స్టోరీ, జీవితాన్ని బ్యాలెన్స్ చేసిన విధానం, పెళ్లి బంధంపై వారి అంకితభావం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
40 ఏళ్లలో అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్
40 ఏళ్ల వయస్సులో రజనీ, డేల్ ఫిట్‌నెస్‌తో అద్భుతంగా మెరిసిపోతున్నారు. డేల్ తెల్లని గడ్డంతో కూడా ఫిట్‌గా యవ్వనంగా కనిపిస్తే, రజనీ విశ్వాసం ఆరోగ్యవంతమైన ఆకర్షణ వీక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఈ జంట పోస్ట్ చేసిన వీడియో 11.5 మిలియన్ల కంటే ఎక్కువ వీక్షణలతో ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో వైరల్గా మారింది.
సోషల్ మీడియా స్ఫూర్తి
వీక్షకులు ఈ జంట యొక్క శక్తి మరియు యవ్వనాన్ని కొనియాడారు. ఒక వ్యాఖ్యాత చెప్పినట్లు, “మీ వయస్సు వెనక్కి వెళ్తున్నట్లు కనిపిస్తోంది!” మరొకరు, “మీ శక్తి మరియు సౌలభ్యం నిజంగా స్ఫూర్తిదాయకం!” అని పేర్కొన్నారు. రజనీ భర్త డేల్, “మేము 23 కాదు, 22 ఏళ్లలో వివాహం చేసుకున్నాము” అని సరదాగా సరిదిద్దారు, వారి ఆనందమైన బంధాన్ని ప్రదర్శించారు.
ప్రేమ ఆరోగ్యకరమైన జీవనశైలి
సోషల్ మీడియాలో బ్యూటీ ఫిల్టర్లు కల్పిత కథనాలు వెల్లువిరిసే ఈ రోజుల్లో, రజనీ డేల్ కథ సహజమైన స్ఫూర్తిని అందిస్తుంది. వారి ఫిట్‌నెస్, సానుకూల దృక్పథం, పరస్పర ప్రేమ వారి జీవితంలో ప్రతి దశాబ్దాన్ని అత్యుత్తమంగా మార్చాయి. ఈ కథ ప్రేమ, ఆరోగ్యం సానుకూల ఆలోచనలు జీవితాన్ని ఎలా అద్భుతంగా మార్చగలవో గుర్తుచేస్తుంది.




