Sleep Disruption Foods: మీకూ రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టడంలేదా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..
నేటి జీవన శైలి కారణంగా ఆరోగ్యమైన ఆహారం తినడం కరువైంది. దీంతో లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నేటి తరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో నిద్రలేమి ఒకటి. ఎవరైనా కనీస నిర్దిష్ట గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యకు మనం తీసుకునే..

ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం. కానీ నేటి జీవన శైలి కారణంగా ఆరోగ్యమైన ఆహారం తినడం కరువైంది. దీంతో లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నేటి తరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో నిద్రలేమి ఒకటి. ఎవరైనా కనీస నిర్దిష్ట గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యకు మనం తీసుకునే ఆహారం కూడా ప్రధాన కారణం. అందువల్ల రాత్రిళ్లు బాగా నిద్రపోవాలనుకుంటే, పడుకునే ముందు ఎట్టిపరిస్థితుల్లోనూ కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మాంసాహారం
మాంసంలో కొవ్వు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే రాత్రిపూట మాంసం తినకూడదు. మీకు ఎంత ఇష్టం ఉన్నా సరే రాత్రిళ్లు మాంసాహారాలు ఎట్టిపరిస్థితుల్లోనూ తినకపోవడమే మంచిది.
కారంగా ఉండే ఆహారం
కారంగా ఉండే ఆహారం తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట కారంగా ఉండే ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ మరింత కష్టమవుతుంది. ఇది అసిడిటీ సమస్యలకు కూడా దారితీస్తుంది.
కాఫీ లేదా టీ
చాలా మందికి రాత్రి భోజనం తర్వాత కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల నిద్రలేమి సమత్య వస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే రాత్రి భోజనం తర్వాత కాఫీ తాగడం మంచిది కాదు. కొంతమంది రాత్రి భోజనం తర్వాత టీ తాగుతారు. కాఫీ లాగే, టీ ఆకులలో కూడా కెఫిన్ ఉంటుంది. కాబట్టి పడుకునే ముందు టీ తాగడం వల్ల నిద్రపై తీవ్ర ప్రభావం పడుతుంది.
జంక్ ఫుడ్
జంక్ ఫుడ్‌లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆహారాలు త్వరగా జీర్ణం కావు. అందువల్ల రాత్రిపూట జంక్ ఫుడ్ తినడం వల్ల రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. అంతే కాదు ఇలాంటి ఆహారాలు అనేక ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








