Horse Gram: తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!

ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది. కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం కల్పించడంలో ఉలవలు దోహదపడతాయి. వీటిలోని పోషకాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించడంలో ఉలవలు సహాయపడతాయి. తద్వారా గుండెకు రక్తసరఫరా మెరుగుపడుతుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి.

Horse Gram: తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!
Horse Gram

Edited By:

Updated on: Apr 27, 2025 | 9:43 AM

ఉలవలు..దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. వీటిని గుర్రాలకు ఆహారంగా ఇస్తారని అందరూ అనుకుంటారు. కానీ, గ్రామాల్లో వీటిని ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తరచూ వీటితో గుగ్గిలు వండుకుని తింటుంటారు. వాటిని ఉడికించగా వచ్చిన నీటితో కట్టుచారు, ఉలవచారు తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఇంతకీ, ఈ ఉలవలు, వాటితో చేసిన వంటకాలు తినటం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో మీకు తెలుసా..? ఉలవలతో ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఉలవలు మంచి బలవర్ధకమైన ఆహారం. మన శరీరానికి శక్తిని అందిస్తాయి. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పీచుపదార్థం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఊబకాయం సమస్య ఉన్నవారు ఉలవలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది పేగు కండరాల కదలికల్ని మెరుగుపర్చి మలం సాఫీగా వచ్చేలా చేస్తుంది. తద్వారా మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. పిల్లల ఎదుగుదలకు ఉలవలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి. వారికి బలాన్ని ఇస్తాయి.

ఉలవల్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు ఉలవలు తినడం ఎంతో మంచిది. వీటిలోని ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో దోహదపడుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంచుతుంది. ఉలవలు తీసుకోవడం ద్వారా ఎక్కిళ్ల సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. మూత్ర సంబంధ సమస్యలు నివారించడంలో ఉలవలు సహాయపడతాయి. దీనికోసం ఓ కప్పు ఉలవ చారుకు సమానంగా కొబ్బరి నీళ్లు తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. ఉలవలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని తగ్గిస్తాయి. చర్మ సమస్యల నివారణలో, కీళ్ళ నొప్పుల నివారణలో బాగా పని చేస్తాయి.

ఇవి కూడా చదవండి

జ్వరం, ఆయాసం, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు ఉలవల కషాయం తాగడం ఎంతో మేలు. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది. కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం కల్పించడంలో ఉలవలు దోహదపడతాయి. వీటిలోని పోషకాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించడంలో ఉలవలు సహాయపడతాయి. తద్వారా గుండెకు రక్తసరఫరా మెరుగుపడుతుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..