Dinner: సాయంత్రం 7లోపు తింటే లాభాలేంటో తెలుసా..?
ఫలానా సమయానికే తినాలనే రూలేం లేదు. రాత్రి ఏం తింటున్నామనేదే మన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. రాత్రి త్వరగా పడుకునే వారు అయితే ఏడు గంటల లోపు తినేస్తే మంచిది. అదే రాత్రి 12 గంటల వరకు మేల్కొని ఉండే వారు మాత్రం ఏడు గంటల ముందు భోజనం చేయడం మంచిది కాదు. ఎందుకంటే మళ్లీ ఆకలి వేయడం జరుగుతుంది. అందుకే ఏడు గంటల తర్వాత మరి లేటు కాకుండా కడుపు నిండ తినాలి, ఆ తర్వాత ఆకలి వేస్తే పాలు తాగితే చాలా మంచిది.

కొత్తొక వింత, పాతొక రోత అనే సామెత అచ్చు తప్పు. కొత్తొక రోత, పాతొక వింత అనేది కరెక్టు. అవును ఈ సామెత మనం రాత్రి పూట తినే విధానానికి సరిపోతుంది. కొన్నేళ్ల కిందట పల్లెటూర్లలో సాయంత్రం ఏడు గంటల లోపు తినే వారు. రాత్రి పదింటి లోపు ఎట్టి పరిస్థితుల్లో పడుకునే వారు. కానీ ఇప్పుడు కాలంతోపాటు మనుషుల జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పులతో పాటు అనారోగ్య సమస్యలు సైతం పెరిగాయి. మరి సాయంత్రం ఏడు గంటలలోపు తింటే లాభాలేంటి..? తినకపోతే వచ్చే అనారోగ్య సమస్యలేంటి..? అసలు అందరు ఏడు గంటలలోపు తినాల్సిందేనా…? తినకపోయిన ఆరోగ్యంగా ఉండొచ్చా..? తెలుసుకుందాం పదండి.
అయితే ఫలానా సమయానికే తినాలనే రూలేం లేదు. రాత్రి ఏం తింటున్నామనేదే మన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. రాత్రి త్వరగా పడుకునే వారు అయితే ఏడు గంటల లోపు తినేస్తే మంచిది. అదే రాత్రి 12 గంటల వరకు మేల్కొని ఉండే వారు మాత్రం ఏడు గంటల ముందు భోజనం చేయడం మంచిది కాదు. ఎందుకంటే మళ్లీ ఆకలి వేయడం జరుగుతుంది. అందుకే ఏడు గంటల తర్వాత మరి లేటు కాకుండా కడుపు నిండ తినాలి, ఆ తర్వాత ఆకలి వేస్తే పాలు తాగితే చాలా మంచిది. అయితే.. రాత్రి ఏడు గంటల్లోపు తినేసి 9 గంటలకు నిద్రపోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక లేటుగా తింటే వచ్చే అనారోగ్యాలేంటి అనంటే.. నిద్రలేమితనం. రాత్రిపూట ఆలస్యంగా తినడం, నిద్రపోవడం మంచి అలవాట్లు కావు. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ముందుగా తినడం వల్ల నిద్రబాగా పడుతుంది. ఇగ ఆలస్యంగా తింటే గుండెకు మంచిది కాదు. కొలెస్ట్రాల్ ముప్పు పెరుగుతుంది. ఇక ముందుగా తింటే ఇన్సులిన్ సెన్సిటివీ పెరుగుతుంది. షుగర్ నియంత్రణ కంట్రోల్‌లో ఉంటుంది. జీవక్రియలు మెరుగ్గా ఉంటాయి. దీనివల్ల లివర్ పై ఒత్తిడి తగ్గుతుంది. హానికారక వ్యర్థాలను బయటకు పంపడానికి వీలు చిక్కుతుంది. కాలేయానికి రెస్టు ఇచ్చినట్టు అవుతుంది. అలాగే బాడీలో హార్మోన్ల ఉత్పత్తి కూడా ఓ క్రమ ప్రకారమే జరుగుతూ ఉంటుంది.
అందుకే ఎన్ని పనులు ఉన్నా సాయంత్రం ఏడు గంటలలోపు తినేస్తే చాలా అనారోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చు. అందుకే ఇప్పటి నుంచి అయిన ఏడు గంటల లోపు భోజనం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
