Weight Loss: ఈజీగా బరువు తగ్గాలంటే.. డైట్ ప్లాన్‌లో ఇవి తప్పక చేర్చండి.. బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే బోలెడు లాభాలు..
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడుతున్నారు. బరువు పెరగడం మీ వ్యక్తిత్వాన్ని పాడుచేయడమే కాకుండా అనేక వ్యాధులకు కారణమవుతుంది. పెరుగుతున్న బరువును నియంత్రించడం చాలా ముఖ్యం.

Weight Loss Tips: జీవనశైలిలో మార్పుల కారణంగా బరువు పెరగడం నేడు సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్యతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. బరువు పెరగడం మీ వ్యక్తిత్వాన్ని కూడా పాడు చేస్తుంది. కొన్నిసార్లు ఇది ఇబ్బందిని కూడా కలిగిస్తుంది. అంతే కాదు, బరువు పెరగడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే అనేక సమస్యలు కూడా వస్తాయి. బరువు పెరగడం వల్ల మధుమేహం, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది బరువు అదుపులో ఉండేందుకు జిమ్‌కి వెళ్తుంటారు. కానీ బిజీ రొటీన్ లైఫ్ వల్ల, రెగ్యులర్ వర్కవుట్‌ల వల్ల, జిమ్‌కి వెళ్లడం వల్ల పెద్దగా ప్రభావం ఉండదు. వీటన్నింటికీ దూరంగా, తేలికగా బరువు తగ్గాలంటే, మీ డైట్ ప్లాన్‌లో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
బ్రేక్‌ఫాస్ట్‌లో డ్రై ఫ్రూట్స్..
పెరుగుతోన్న బరువు గురించి ఆందోళన చెందుతుంటే, ఉదయం తేలికపాటి అల్పాహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. కొంతమంది ఉదయాన్నే పరాటాలు, పూరీలు తినడానికి ఇష్టపడతారు. ఇటువంటి పరిస్థితిలో, మీరు ఉదయపు అల్పాహారంలో డ్రై ఫ్రూట్స్ ఎంచుకుంటే, అది మీకు పూర్తి పోషకాహారాన్ని అందిస్తుంది. అలాగే మీ బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. స్థూలకాయంతో బాధపడేవారు ఉదయాన్నే కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఉన్న పదార్థాలను తినకూడదు. లేకపోతే బరువు మరింత పెరగడం ప్రారంభమవుతుంది. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.




పిస్తాపప్పులు..
బరువు తగ్గడానికి, మీరు తప్పనిసరిగా పిస్తాలను తినాలి. పిస్తాపప్పులో ఫైబర్ ఉంటుంది. దీని కారణంగా శరీరంలో శక్తి దిట్టంగా చేరుకుంటుంది. ఇది ఎక్కువ కాలం ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది కూడా పదే పదే ఆకలిని కలిగించదు. దీన్ని ఉదయం అల్పాహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.
ఖర్జూరాలు..
అంతే కాకుండా ఖర్జూరాన్ని కూడా ఆహారంలో చేర్చుకోవాలి. ఖర్జూరం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది విటమిన్ B5 ను కలిగి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. బరువు తగ్గించడంలో చాలా సహాయపడుతుంది.
వాల్‌నట్స్..
వాల్‌నట్‌లు కూడా చాలా మేలు చేస్తాయి. ఇది కొవ్వును కరిగించేందుకు పనిచేస్తుంది. అల్పాహారంలో వాల్‌నట్‌లను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇది శరీరాన్ని ఆరోగ్యంhealth benefits, Health care, Weight Loss, Weight Loss Tips, Telugu health tips, Weight Loss benefitsగా ఉంచడంతో పాటు ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఇది కాకుండా, వాల్‌నట్‌లు గుండె జబ్బుల నుంచి కూడా గొప్ప ఉపశమనాన్ని అందిస్తాయి. వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయి.
గమనిక: ఈ కథనంలోని అందించిన చిట్కాలు, సలహాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా చిట్కాలను, పద్ధతులను ప్రారంభించే ముందు లేదా మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించండి.




