Health Tips: ఈ 6 పదార్థాలను ఇలా తింటున్నారా.. శరీరంలోని ప్రతి భాగం విషంలా మారే ఛాన్స్.. అవేంటో తెలుసా?
ఆరోగ్యకరమైన శరీరం కోసం, ఆహారంలో పోషకాలను చేర్చడం చాలా ముఖ్యం. కానీ రోజూ తినే కొన్ని ఆరోగ్యకరమైన వాటిలో ఆరోగ్యానికి హాని కలిగించే బ్యాక్టీరియాలు కనిపిస్తాయి. వీటిని తప్పుగా తీసుకోవడం వల్ల మీ శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి.
మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం అవసరం. శరీరం మెరుగైన పనితీరు కోసం విటమిన్లు, ప్రోటీన్లు , కాల్షియం, మినరల్స్ అన్నీ అవసరమైన పోషకాలు. ఇలాంటి పోషకాలన్నీ ఎనో ఆహారాలు, పానీయాల్లో కనిపిస్తాయి. ఇందుకు వైద్యులు, నిపుణులు ప్రతిరోజూ వేర్వేరు ఆహారాలను తినమని సిఫార్సు చేయడానికి కారణం ఇదే. సహజంగానే, మనం మార్కెట్‌కి వెళ్లినప్పుడు, ఆరోగ్యానికి మేలు చేసే వస్తువులను మాత్రమే తీసుకోవాలని కోరుకుంటాం. కానీ, ప్రతిరోజూ తినే కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యంగా కనిపిస్తున్నా కొన్ని పదార్థాలు.. అవి నెమ్మదిగా మీ శరీరానికి హాని కలిగిస్తుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలకూర..
సెంటర్ ఫర్ సైన్స్ ఇన్ ది పబ్లిక్ ఇంటరెస్ట్ శాస్త్రవేత్తలు గత 12 సంవత్సరాల డేటాను విశ్లేషించి, ఎన్నో విషయాలు కనుగొన్నారు. ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ఆహారాలు ఎన్ని ఉన్నాయి, ఏవున్నాయో తెలుసుకున్నారు. ఇందులో పాలకూర నంబర్ వన్‌గా నిలిచింది. కాబట్టి తినే ముందు శుభ్రంగా కడుక్కోవడం మంచిది.
గుడ్లు..
JNFలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కోడి గుడ్డుపై అతుక్కుపోయి కొన్ని క్రిములు ఉంటాయి. వాటిని అలాగే తినడం వల్ల రోగాల బారిన పడే ఛాన్స్ ఉంటుంది. ఇలానే తింటే కడుపులోకి వెళితే సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చు. పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ముఖ్యంగా ప్రమాదంలో పడ్డట్లే. గుడ్లు కడిగిన తర్వాతే తినాలి.
చికెన్..
పచ్చి కోడి మాంసం రసంలో క్యాంపిలోబాక్టర్ బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఈ బ్యాక్టీరియా జ్వరం, జీర్ణశయాంతర రుగ్మతలకు కారణమవుతుంది. మాంసాన్ని కడుగుతున్నప్పుడు ఈ బ్యాక్టీరియా ఎక్కడో మిగిలి ఉంటే, అప్పుడు మీ సమస్యలు మరింత పెరుగుతాయి. సురక్షితంగా ఉండాలంటే పచ్చి చికెన్‌ను బాగా కడగాలి. చికెన్‌ను కోసిన తర్వాత కట్టింగ్ బోర్డులు, కత్తులను శుభ్రంగా కడగాలి.
ట్యూనా చేప..
సెంటర్ ఫర్ సైన్స్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ నివేదికల ప్రకారం, చేపలను డీఫ్రాస్ట్ చేసి తప్పుగా నిల్వ చేస్తే, స్కాంబ్రోటాక్సిన్ అనే టాక్సిక్ ప్రొటీన్ ఏర్పడుతుంది. ఇది చర్మపు దద్దుర్లు, వాంతులు, పొత్తికడుపు నొప్పి, అతిసారం, అధిక హృదయ స్పందన రేటు, దృష్టిని కోల్పోయేలా చేసే ఒక రకమైన ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది.
చీజ్..
చీజ్‌లో ఎటువంటి విషపూరిత రసాయనాలు ఉండవు. కానీ, దాని తయారుచేసే సమయంలో కల్తీ అయితే, అది విషాన్ని కలిగిస్తుంది. తయారు చేసే సమయంలో జబ్బుపడిన జంతువులు లేకుండా పాశ్చరైజ్డ్ పాలను ఉపయోగించడం వల్ల బ్రూసెల్లోసిస్, లిస్టెరియోసిస్ అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది.
మాంసం..
యాంటీమైక్రోబయాల్ మందులు, ఈకోలి, సాల్మొనెల్లా, లిస్టెరియా వంటి బ్యాక్టీరియా జాడలను ముక్కలు చేసిన లేదా గ్రౌండ్ మీట్‌లో నిపుణులు కనుగొన్నారు. అందుచేత మాంసాన్ని సన్నగా, చదునైన ముక్కలుగా చేసి వేయించడం మంచిది.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసమే. ఇవి ఏదైనా ఔషధం లేదా చికిత్సకు ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా టిప్స్, సూచనలు పాటించే ముందు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.