Viral: పెళ్లి కాలేదు.. ఎవరితోనూ శృంగారం చేయలేదు.. కానీ హెచ్‌ఐవీ పాజిటివ్ తేలింది.. కారణం తెలిస్తే ఫ్యూజులౌట్!

వీరంతా 20 నుంచి 25 ఏళ్లలోపు వారే. వీరికి ఇంకా పెళ్లి కాలేదు. ఎవరితోనూ అసురక్షిత శృంగారంలో పాల్గొనలేదు. కానీ, వీరికి టెస్టుల్లో హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలడంతో డాక్టర్లతో పాటు వీరి కుటుంబాలు కూడా షాక్ అయ్యారు.

Viral: పెళ్లి కాలేదు.. ఎవరితోనూ శృంగారం చేయలేదు.. కానీ హెచ్‌ఐవీ పాజిటివ్ తేలింది.. కారణం తెలిస్తే ఫ్యూజులౌట్!
Hiv Positive
Venkata Chari

|

Aug 07, 2022 | 9:01 PM

వారణాసిలోని పీటీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రిలో గత రెండు నెలల్లో నిర్వహించిన విచారణలో 12 మంది యువకులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. ఈ ఇన్ఫెక్షన్ వెనుక ఉన్న కారణాన్ని కనుగొనే ప్రయత్నంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. దీంతో షాక్ అవ్వడం వారి వంతైంది. కాగా వీరంతా సరదాగా టాటూ వేయించుకున్నారని, అదే ఆశ ఇప్పుడు వారి పాలిట శాపంలా మారిందని తెలుస్తోంది. యువతలో ఇటీవల టాటూలు వేయించుకునే అలవాలు విపరీతంగా పెరిగిపోయింది. సాధారణంగా టాటూ వేసుకునేటప్పుడు.. అందుకు ఉపయోగించే సూది కొత్తదా లేదా ఉపయోగించినదా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఇది హెచ్‌ఐవీ పాజిటివ్‌గా మారడానికి కారణంగా మారుతోంది. ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో పచ్చబొట్టు కళాకారులు అదే సూదితో ఎక్కువమందికి ఉపయోగించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

ఆసుపత్రికి చెందిన యాంటీ రెట్రోవైరల్ ట్రీట్‌మెంట్ సెంటర్‌కు చెందిన డాక్టర్ ప్రీతి అగర్వాల్ ప్రకారం, “పాజిటివ్‌గా తేలిన వారికి మొదట సాధారణ జ్వరం వచ్చింది. తర్వాత శరీరం బలహీనంగా మారింది. ఎన్నో చికిత్సల తర్వాత, హెచ్‌ఐవి పరీక్ష చేసినప్పుడు, రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది.” అని తెలిపారు.

వారణాసిలోని ఓ ప్రాంతానికి చెందిన రవి (పేరు మార్చాం) వయసు 20 ఏళ్లు. తన గ్రామంలో జరిగిన జాతరలో టాటూ వేయించుకున్నాడు. కొన్ని నెలల తర్వాత, అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. జ్వరం కూడా మొదలైంది. ఆ తర్వాత బలహీనత కూడా రోజురోజుకు ఎక్కువైంది. రవి వైరల్, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ సహా అన్ని చెకప్‌లు చేశారు. మందులు కూడా నిరంతరంగా వాడుతున్నాడు. కానీ, ఉపశమనం లేదు. చివరకు వైద్యులు అతనికి హెచ్‌ఐవి పరీక్షలు చేయించారు. విచారణలో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో అంతా షాక్ అయ్యారు.

తనకు పెళ్లి కాలేదని, ఎవరితోనూ శారీరక సంబంధం పెట్టుకోలేదని, ఏ కారణం చేత రక్తం ఎక్కించలేదని రవి డాక్టర్‌తో చెప్పాడు. అలాంటప్పుడు అతను హెచ్‌ఐవి పాజిటివ్ ఎలా అవుతాడు? అని డాక్టర్లు సందిగ్ధంలో పడ్డారు.

వారణాసిలో ఉంటున్న 25 ఏళ్ల ప్రేమ (పేరు మార్చాం) ఒక హాకర్ చేత టాటూ వేయించుకుంది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. వైద్యుల సలహా మేరకు సాధారణ పరీక్షతో పాటు హెచ్‌ఐవీ పరీక్ష కూడా చేయించారు. హెచ్‌ఐవి రిపోర్టు పాజిటివ్‌గా వచ్చినప్పుడు, ప్రేమ పరిస్థితి కూడా అలానే ఉంది.

చాలా మంది ఒకే సూదితో..

దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఈ వ్యక్తులు ఎవరితోనూ అసురక్షిత శృంగారంలో పాల్గొనలేదు. లేదా వారికి ఇన్ఫెక్షన్ ఇంజెక్షన్లు తీసుకోలేదు. వారి నివేదిక సానుకూలంగా రావడంతో, వీరంతా ఆశ్చర్యపోయారు. వీరిలో అత్యధికులు 20 నుంచి 25 ఏళ్లలోపు వారే కావడం డాక్టర్లు షాక్ అయ్యారు. డాక్టర్ల ప్రకారం, ఈ రోగులకు కౌన్సెలింగ్ చేసిన తర్వాత, టాటూ వేయించుకున్న తర్వాత వారి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించిందని తేలింది. వాస్తవానికి, టాటూ వేయడానికి ఉపయోగించే సూదికి ఇన్ఫెక్షన్ సోకింది. దీంతోనే చాలా మంది శరీరంపై టాటూలు వేయించుకున్నారు. ఈ కారణంతో వీరంతా పాజిటివ్‌గా తేలారు.

పచ్చబొట్టు వేసిన సూది చాలా ఖరీదైనది. ఒక సూది నుంచి ఒక వ్యక్తి మాత్రమే పచ్చబొట్టు వేయాలి. ఒకసారి ఉపయోగించిన సూదిని మళ్లీ ఉపయోగించకూడదు లేదా అది ప్రాణాంతకం కావచ్చు. డాక్టర్ల ప్రకారం, మీరు ఇటీవల పచ్చబొట్టు వేయించుకున్నట్లయితే, వెంటనే అప్రమత్తంగా ఉండండి. HIV పరీక్ష చేయించుకోండి.

టాటూ వేయించుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..

కొత్త సూదిని ఉపయోగించండి.

బ్రాండెడ్ సూదిని ఉపయోగించండి.

పచ్చబొట్లు వేసేందుకు ఉపయోగించే ప్రతిదాన్ని జాగ్రత్తగా పరిశీలించండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu