Viral: వాయమ్మో.. స్కూల్ పిల్లలే కానీ దేశముదుర్లు.. పాఠాలు వినాల్సిన వీళ్లు.. సీన్ కట్ చేస్తే..

పంచ్ డైలాగుల ప్రభావం ఎంతవరకు ఉందో తెలియదు గానీ.. సినిమాల ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా..

Viral: వాయమ్మో.. స్కూల్ పిల్లలే కానీ దేశముదుర్లు.. పాఠాలు వినాల్సిన వీళ్లు.. సీన్ కట్ చేస్తే..
Panipat
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 07, 2022 | 8:28 PM

పంచ్ డైలాగుల ప్రభావం ఎంతవరకు ఉందో తెలియదు గానీ.. సినిమాల ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా ఈ ప్రభావం స్కూల్ పిల్లలపై పడుతోంది. వారిలో మారుతున్న ఆలోచనలే ఇందుకు నిదర్శనం. ఇక ఇప్పుడు మేము చెప్పబోయే స్కూల్ పిల్లలు.. పిల్లలు కాదు దేశముదుర్లు.. పాఠాలు వినాల్సిన వీళ్లు.. ఏకంగా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యారు. అందుకోసం వీరు ఎంతకు తెగించారో తెలిస్తే.. మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ కథేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని పాట్నాలో స్థానిక పాఠశాలలో చదువుతున్న ఇద్దరు యువతులు, ఇద్దరు అబ్బాయిలు.. పాఠాల మీద శ్రద్ధ పెట్టకుండా.. వారి వయస్సుకు మించి ఆలోచించారు. తమకు ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టిందనుకుని.. పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యారు. అంతేకాదు.. ఎవ్వరూ తమను ఆపకూడదన్న ఉద్దేశంతో ఏకంగా రాష్ట్రాలు ధాటి హర్యానాలోని పానిపట్‌కు చేరారు. అక్కడ స్థానిక ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు సిద్దం కాగా.. దేవాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడున్న మొత్తం ఐదుగురు స్కూల్ పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారులకు అప్పగించారు.

మొదట ఆ పిల్లలు తమ వివరాలను చెప్పేందుకు సుముఖంగా లేకపోగా.. అధికారులు లోతుగా ప్రశ్నించడంతో.. పెళ్లి చేసుకునేందుకు పాట్నా నుంచి పానిపట్ వచ్చామన్న నిజాన్ని బయటపెట్టారు. ఆ పిల్లల్లో ఒకరి వయస్సు 18 ఏళ్లు కాగా.. మిగిలిన అందరి వయస్సు 13-17 ఏళ్లు ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ స్కూల్ పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం.. బీహార్ పోలీసులకు అప్పగించనున్నారు పానిపట్ ఖాకీలు. కాగా, తమ పిల్లలు కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ కంప్లయింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?