Real Vs Fake Mithai: మిఠాయిలు కొంటున్నారా.. అవి కల్తీవో.. కావో ఈ సింపుల్ చిట్కాలతో తెలుసుకోండి ఇలా

Surya Kala

Surya Kala |

Updated on: Oct 13, 2021 | 7:47 PM

Real Vs Fake Mithai: పండుగలు, ఫంక్షన్లు ఏ శుభకార్యాలకైనా స్వీట్స్ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇక దసరా పండగను దేశ వ్యాప్తంగా  అక్టోబర్ 15 న జరుపుకోనున్నారు. ఈ పండగ..

Real Vs Fake Mithai: మిఠాయిలు కొంటున్నారా.. అవి కల్తీవో.. కావో ఈ సింపుల్ చిట్కాలతో తెలుసుకోండి ఇలా
Real Vs Fake Mithai

Follow us on

Real Vs Fake Mithai: పండుగలు, ఫంక్షన్లు ఏ శుభకార్యాలకైనా స్వీట్స్ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇక దసరా పండగను దేశ వ్యాప్తంగా  అక్టోబర్ 15 న జరుపుకోనున్నారు. ఈ పండగ రోజున కుటుంబం సభ్యులు, స్నేహితులు తమకు ఇష్టమైన స్వీట్స్ తో గ్రీటింగ్స్ ను చెప్పుకుంటారు.  లడ్డు, సోన్ పాపిడి, లడ్డు, కాజా ఇలా రకరకాల మిఠాయిలతో పండగను సెలబ్రేట్లే చేసుకుంటారు. అయితే  పండగ సీజన్ లో  స్వీట్లకు పెరిగిన డిమాండ్‌ దృష్ట్యా.. కొంత మేర కల్తీ జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిఠాయిల్లో కల్తీని గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం..

*ముఖ్యంగా స్వీట్స్ ను కొన్ని రకాల పొడులతో తయారు చేస్తున్నారు. అవి అత్యంత కల్తీవని అంటున్నారు. *ఇక కాజూ బర్ఫీ వంటి స్వీట్స్ వెండి రేకుతో వస్తాయి. అయితే కొన్ని దుకాణదారులు స్వీట్స్ ను వెండి రేకు బదులు అల్యూమినియం రేకుతో భర్తీ చేస్తున్నారు. అలాంటి స్వీట్స్ ను తిన్నవారికి ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకని వెండి రేపు, అల్యూమినియం రేకుల తేడా ను గుర్తించడానికి కొన్ని పద్ధతులు సూచిస్తున్నారు.  పై భాగాన్ని సున్నితంగా తాకడం ద్వారా  తెలుసుకోవచ్చు. పొర  వేలికి వస్తే నకిలీదని అర్ధం. ఇక ఒక స్పూన్ లో రేకులో కొంత భాగాన్ని తీసుకుని వేడి చేయాలి… వెండి రేకులు అయితే బాల్స్ లా మెరుస్తాయి. అల్యూమినియం రేకు అయితే బూడిద బూడిదగా మారుతుంది. * మిఠాయి ఓల్డ్ స్టాక్ అయితే  పుల్లని రుచిని కలిగి ఉంటుంది. అంతేకాదు స్మెల్ లో కూడా తేడా వస్తుంది. * స్వేఛ్చమైన నెయ్యి తో చేసిన స్వీట్స్ కమ్మగా అనిపిస్తుంది. *కోవా స్వేచ్ఛమైనది అవునో కాదో తెలుసుకోవాలంటే.. కోవకు కొంచెం చక్కర కలిసి వేడి చేస్తే.. అది నీరులా మారితే… నకిలీ అని అర్ధం *స్వీట్‌ కల్తీ అవునో కాదో తెసుకోవాలంటే .. స్వీట్ ను నీటిలో ఉంచి..  గట్టిగా కదిలించాలి. ఇది నురుగుగా ఏర్పడితే..కల్తీ స్వీట్స్ అని అర్ధం.

Also Read: Hyderabad Crime News: హైదరాబాద్ నడి రోడ్డుపై దారుణ హత్య.. వేటకొడవళ్లతో యువకుడిని వెంటాడి వేటాడి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu