బొప్పాయి తినే అలవాటుందా..? వామ్మో.. మర్చిపోయి కూడా ఇలాంటి తప్పులు చేయకండి..
బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే కొన్ని ఆహారపదార్థాలతో దీనిని తినకుండా ఉండాలని.. లేకుంటే ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. బొప్పాయిని కొన్ని ఆహార పదార్థాలతో తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ వివరాలను తెలుసుకోండి..
బొప్పాయిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. బొప్పాయి చాలా ప్రయోజనకరమైన పండు అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.. ఇది మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.. ఇంకా చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పాపైన్ అనే ఎంజైమ్ లు పుష్కలంగా ఉన్నాయి.. ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే బొప్పాయిని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తినడం ఆరోగ్యానికి హానికరమని.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు..
బొప్పాయిని సరైన కలయిక (వేరే ఆహార పదార్థాలతో) లేకుండా తీసుకోవడం వల్ల మీరు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.. ఇక్కడ అలాంటి 5 కారణాలను వివరించబోతున్నాం.. బొప్పాయిని కొన్ని ఆహార పదార్థాలతో ఎందుకు తినకూడదు.. నిపుణులు ఏం చెబుతున్నారు.. అనే వివరాలను తెలుసుకోండి.
బొప్పాయి – పాలు: పాపైన్ అనే ఎంజైమ్ బొప్పాయిలో ఉంటుంది.. ఇది పాలలో ఉండే ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా పాలు సరిగా జీర్ణం కాకపోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి.
బొప్పాయి – సిట్రస్ పండ్లు: నిమ్మ, నారింజ లేదా ద్రాక్ష వంటి పుల్లని పండ్లతో కలిపి బొప్పాయి తినడం కూడా హానికరం. సిట్రస్ పండ్లు – బొప్పాయి రెండూ ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది కడుపులో అధిక యాసిడ్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది కడుపులో చికాకు, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తుంది.
బొప్పాయి – తేనె: బొప్పాయితో పాటు తేనె కూడా తీసుకోవడం శరీరానికి మంచిది కాదు. రెండింటినీ ఒకేసారి తినడం వల్ల కడుపులో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
బొప్పాయి – చికెన్: బొప్పాయితో చికెన్ తీసుకోవడం కూడా జీర్ణక్రియకు మంచిది కాదు. బొప్పాయిలో పాపైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.. అయితే చికెన్ వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్‌తో తీసుకోవడం వల్ల కడుపులో ఎక్కువ ఆమ్లం ఏర్పడుతుంది. ఇది అజీర్ణం – కడుపు నొప్పికి కారణం కావచ్చు.
బొప్పాయి – బంగాళాదుంప: బొప్పాయి, బంగాళాదుంపలను ఒకేసారి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. బంగాళాదుంపలో స్టార్చ్ ఉంటుంది.. బొప్పాయిలో పపైన్ ఎంజైమ్ ఉంటుంది.. కాబట్టి ఈ రెండు ఆహారాలను కలిపి తింటే, అది కడుపులో అసౌకర్యం, గ్యాస్, ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..