సూపరంటే సూపర్.. బత్తాయి రసంలో ఇది కలిపి తాగితే నా సామిరంగ.. ఇక తిరుగుండదు..
రోజూ పండ్ల రసం తీసుకోవడం వల్ల రక్తం తయారవుతుంది. రక్షణ వ్యవస్థ బలపడుతుంది, కాలేయం శుభ్రపడుతుంది, వృద్ధాప్య ఛాయలు మందగిస్తాయి. పండ్ల రసాలను సింగిల్‌గా కాకుండా, రెండు లేదా అంతకంటే ఎక్కువ పండ్లను కలిపి తీసుకోవడం వల్ల రుచి మెరుగుపడుతుందని డైటీషియన్లు చెబుతున్నారు. ఇంకా ఖర్చు తగ్గుతుంది, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

ఎండలు మండిపోతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.. అయితే.. ఎండాకాలంలో కొన్ని పండ్లు తీసుకుంటే బెటర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి పండ్ల రసాల ప్రాముఖ్యతను నొక్కిచెబుతున్నారు. పండ్ల రసాలు సూక్ష్మపోషకాలు, మైక్రోన్యూట్రియెంట్స్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. అవి రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో, కాలేయం నుండి విష పదార్థాలను తొలగించడంలో, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంలో సహాయపడతాయి. అయితే, చాలామంది పండ్ల ధరలు అధికంగా ఉంటాయని భావించి, వాటిని కొనుగోలు చేయడానికి వెనకాడతారు. అయితే.. జంక్ ఫుడ్, బయటి ఆహారం, వినోదం వంటి వాటిపై పెట్టే ఖర్చు కంటే పండ్ల రసాలపై పెట్టే ఖర్చు ఎన్నో రెట్లు తక్కువని, ఇది దీర్ఘకాలికంగా ఆసుపత్రి ఖర్చులను తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. ఆరోగ్యాన్ని రక్షించుకునే వాటికి వెల కట్టకూడదని ఆయన ఉద్ఘాటిస్తున్నారు.
ప్రతిరోజూ కనీసం ఒక పండ్ల రసం తీసుకోవాలని సూచిస్తున్నారు. కేవలం ఒకే రకం పండు రసం తాగే బదులుగా, వివిధ పండ్ల రసాలను కలిపి (మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్) తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు. ఉదాహరణకు, పైనాపిల్ రసం చాలా ఘాటుగా, పులుపుగా ఉంటుంది, కొందరికి గ్యాస్ లేదా ఎసిడిటీ కలిగించవచ్చు. అలాంటి వారు పైనాపిల్ రసంలో చెరుకు రసాన్ని కలిపి తాగితే, రుచి మెరుగుపడటమే కాకుండా, ఘాటు, ఎసిడిటీ తగ్గుతాయి. దీని ద్వారా తేనె కలపాల్సిన అవసరం కూడా ఉండదు.
అలాగే, ఖరీదైన దానిమ్మ రసం తాగాలనుకునేవారు క్యారెట్ రసంతో కలిపి తీసుకోవచ్చు. ఇది ఖర్చును తగ్గిస్తుంది.. పోషకాలను పెంచుతుంది. ఇక, సాధారణంగా పుల్లగా ఉండే బత్తాయి రసాన్ని పుచ్చకాయ రసంతో కలపడం వల్ల బత్తాయిలోని పులుపు తగ్గి, పుచ్చకాయ రసానికి శక్తి, రుచి వస్తాయి. ఒక స్పూన్ తేనె జోడించడం ద్వారా ఇది మరింత రుచిగా మారుతుంది. కమలా రసం కొన్నిసార్లు పుల్లగా అనిపిస్తే, దానిలో ఖర్బూజా రసం కలపడం ద్వారా రుచిని సమతుల్యం చేసుకోవచ్చు.. దీనివల్ల శరీరానికి పోషకాలు అందడంతోపాటు.. శక్తివంతంతగా మారొచ్చు..
ఇంట్లోనే బయట మార్కెట్‌లో దొరికే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్‌లలో ఐస్, చక్కెర, పాలు వంటి అనవసర పదార్థాలు కలిపి క్వాంటిటీ పెంచుతారు.. కానీ పోషకాలు ఉండవని, దీనివల్ల ప్రయోజనాలకు బదులు నష్టాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. పండ్ల రసాలను కలిపి తీసుకోవడం వల్ల వాటి ప్రయోజనాలు తగ్గవని లేదా దుష్ప్రభావాలు రావని డైటీషియన్లు చెబుతున్నారు. పాలు, అరటిపండు వంటి కొన్ని పండ్లను రసాలలో కలపవద్దని, వాటిని ముక్కలుగా తినడమే మంచిదని సూచిస్తున్నారు. ఏడాదిన్నర వయసు నుండి పిల్లలకు కూడా ప్రతిరోజూ ఒక గ్లాసు మిశ్రమ పండ్ల రసాలను అలవాటు చేస్తే వారి ఆరోగ్యం, రోగనిరోధక శక్తి ఎంతో మెరుగుపడతాయని పేర్కొంటున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
