విహారయాత్రలో విషాదం.. పర్యాటక క్రూయిజ్ బోల్తా.. కళ్ల ముందే మునిగిపోయిన కుటుంబం..!
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురువారం (ఏప్రిల్ 30) సాయంత్రం బర్గి డ్యామ్‌లో పర్యాటకులతో వెళ్తున్న ఎంపీ టూరిజం క్రూయిజ్ షిప్ అకస్మాత్తుగా మునిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో క్రూయిజ్‌లో 29 మంది పర్యాటకులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు నలుగురు మరణించగా, 15 మందిని రక్షించారు. మరో 11 మంది గల్లంతయ్యారు.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురువారం (ఏప్రిల్ 30) సాయంత్రం బర్గి డ్యామ్‌లో పర్యాటకులతో వెళ్తున్న ఎంపీ టూరిజం క్రూయిజ్ షిప్ అకస్మాత్తుగా మునిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో క్రూయిజ్‌లో 29 మంది పర్యాటకులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఆరుగురు మరణించగా, 15 మందిని రక్షించారు. మరో 11 మంది గల్లంతయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ (SDRF), మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగారు. పీడబ్ల్యూడీ మంత్రి రాకేష్ సింగ్, మంత్రి ధర్మెంద్ర సింగ్ లోధి, స్థానిక ఎమ్మెల్యేలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన వారి కోసం హైదరాబాద్ నుండి ఆర్మీ హెలికాప్టర్‌ను రప్పించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్న మంత్రి రాకేష్ సింగ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి, క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి.
ఈ ప్రమాదంలో బీహార్‌కు చెందిన కూలీలు చూపిన సాహసం ఎందరినో ఆకట్టుకుంది. అక్కడ నిర్మాణ పనుల్లో ఉన్న కరణ్ సింగ్ అతని బృందం వెంటనే స్పందించి, లైఫ్ జాకెట్లు, ట్యూబుల సాయంతో సుమారు 14 మందిని రక్షించారు. గాలి వాన బీభత్సంగా ఉన్నప్పటికీ, ప్రాణాలకు తెగించి బాధితులను ఒడ్డుకు చేర్చారు. ఖమారియా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి కామరాజ్ ఆర్య తన 22 మంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వచ్చారు. ఈ ప్రమాదంలో అతని ఒక కుమారుడు సురక్షితంగా బయటపడగా, కామరాజ్, అతని భార్య, మరో కుమారుడు గల్లంతయ్యారు. కర్ణాటకకు చెందిన వీరి కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
సమయానికి బలమైన తుఫాను రావడం, అలలు ఎగిసిపడటమే ప్రాథమిక కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం జేసీబీలు, గ్యాస్ కట్టర్ల సాయంతో మునిగిపోయిన క్రూయిజ్‌ను బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చీకటి, వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సమగ్ర దర్యాప్తు తర్వాతే అసలు కారణాలు వెల్లడికానున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
